ఎన్టీఆర్ పేరు తీసేశారు.. ఇప్పుడు కూడా జగన్ బాబేనా లక్ష్మీ పార్వతి?

Update: 2022-09-21 07:38 GMT
శత్రువు శత్రువుకు మిత్రుడు అన్న మాటకు ఏ మాత్రం తీసిపోని రీతిలో  ఏపీ రాజకీయాలు కనిపిస్తూ ఉంటాయి. స్వర్గీయ ఎన్టీఆర్ కు వైఎస్ కు లింకు లేకయినప్పటికీ చంద్రబాబు మీద ఉన్న కోపంతో ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి జగన్ పార్టీలో చేరటం..ఆయన్నుజగన్ బాబు అంటూకీర్తించటం తెలిసిందే.

తన జీవితంలో కాంగ్రెస్ ను కానీ కాంగ్రెస్ నేతల వద్దకు కానీ వెళ్లేందుకు సుతారం ఇష్టపడని ఎన్టీఆర్ కు భిన్నంగా ఆయన్ను రెండో పెళ్లి చేసుకున్న లక్ష్మీ పార్వతి మాత్రం కాంగ్రెస్ మూలాలు ఉన్న వైసీపీలో జాయిన్ కావటం.. జగన్ ను కీర్తిస్తూ.. చంద్రబాబును తిట్టేస్తుంటారు.

జిల్లాల పునర్విభజనలో విజయవాడ ప్రధాన కేంద్రంగా ఏర్పాటు చేసిన జిల్లాకు వైసీపీ ప్రభుత్వం ఎన్టీఆర్ జిల్లాగా పేరు పెట్టింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ను టీడీపీ.. చంద్రబాబు అలక్ష్యం చేస్తే.. అందుకుభిన్నంగా తాము మాత్రంఆయన మీద ఎంతో గౌరవం ఉన్నట్లుగా గొప్పులు చెప్పుకున్నారు.

ఒక చిన్న జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టిన జగన్ ప్రభుత్వం.. దశాబ్దాలుగా ఉన్న రాష్ట్ర స్థాయి వర్సిటీకి ఉన్నఆయన పేరును తీసేసి.. వైఎస్సార్ పేరును పెట్టటంలో ఔనిత్యం ఏమిటన్నది ప్రశ్న.

తరచూ జగన్ ను కీర్తించే.. ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీ పార్వతి.. తాజాగా ఆయన పేరును తొలగించటంపై ఎలా రియాక్టు అవుతారు? ఇప్పుడు కూడా మా జగన్ బాబు అని కీర్తిస్తారా? ఎన్టీఆర్ పేరును తీసేసే విషయంలో జగన్ సర్కారు అనుసరించిన వ్యూహాన్ని సరికొత్తగా ఆవిష్కరిస్తూ.

ఆ పేరును తీసేయటం ఎంత సబబు? అన్న జస్టిఫికేషన్ కూడా ఇస్తారా? అన్నదిప్పుడు ప్రశ్న. మొత్తానికి ఇంతకాలంజగన్ కు వీర విధేయురాలిగా వ్యవహరించిన లక్ష్మీ పార్వతి.. తన భర్త పేరును తీసేసే విషయంలో రియాక్టు అయ్యే తీరు ఆసక్తికరంగా మారింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News