ఎన్టీవీ.. తెలుగు రాష్ట్రాల్లో నంబర్ వన్ ఛానెల్ గా తన సత్తాను చాటుతోంది. 24x7 వార్తా ప్రసారాలతో ఎప్పటికప్పుడు వేగంగా, వాస్తవంగా ప్రజోపయోగమైన వార్తల ప్రసారం చేస్తూ ముందుకు దూసుకుపోయింది. తప్పును ఖండిస్తూ, ఒప్పును అభినందిస్తూ, ఊకదంపుడు ఉపన్యాసాలను దూరంపెడుతూ "ప్రతి క్షణం-ప్రజా హితం" ట్యాగ్ లైన్ కు న్యాయం చేస్తూ ముందుకు వెళ్తుంది.
తుమ్మల నరేంద్ర చౌదరి ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ 24గంటల తెలుగు న్యూస్ ఛానల్ నెంబర్ 1 అనే తన ఐడెంటిటీని కాపాడుకుంటూ వస్తుంది. ప్రారంభం నుంచి ప్రజాభిప్రాయమే అజెండాగా ముందుకు వెళ్తున్న ఈ ఛానల్... గ్రామస్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయివరకూ తన కవరేజీ స్థాయిని విస్తరించుకోవడంలో సక్సెస్ అవుతూనే ఉంది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారి ఆదరణ పొందుతూ వచ్చింది.
వార్త ఏదైనా, ప్రాంతం మరేదైనా, పరిస్థితులు ఎలాంటివైనా... కచ్చితమైన సమాచారాన్ని, వీలైనంత వేగంగా అందించడమే ప్రాధమిక సూత్రాలుగా ఎంచుకున్న ఎన్టీవీ... ప్రతిసారీ దాన్ని నిలబెట్టుకుంటూ వస్తుంది. వార్తలంటే ఛానళ్ల అధినేతలు తమ వ్యక్తిగత అభిప్రాయాలను జనం పై రుద్దడం కాదని బలంగా నమ్మే ఈ ఛానల్ యాజమాన్యం... ఆ విషయంలో తగ్గేదేలే అన్నట్లుగా ఉండటం ఈ సక్సెస్ కు కారణం అని చెప్పకతప్పని పరిస్థితి.
ఈ నేపథ్యంలో తాజాగా వెల్లడైన బార్క్ రేటింగ్స్ ప్రకారం ఎన్టీవీ 66.5 టీఆర్పీలతో ఫస్ట్ ప్లేస్ లో ఉంది. "ప్రతి క్షణం-ప్రజా హితం" అని ఎంచుకున్న స్లోగన్ కి న్యాయం చేస్తూ... ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా తాము ఎంచుకున్న ట్యాగ్ లైన్ ను వదలకుండా.. బెదరకుండా.. బెదిరించకుండా.. నిత్యం ప్రజల పక్షాన నిలబడుతుండటమే ఎన్టీవీని తెలుగు మీడియా రంగంలో నెంబర్ 1 గా నిలబెడుతుంది. దీంతో ఎన్టీవీ సిబ్బంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సిబ్బంది పనితీరును అభినందిస్తూ యాజమాన్యం హర్షం వ్యక్తం చేస్తుంది!