పాపం టీడీపీ పరిస్థితి ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకేలా మారిపోయింది. రాష్ట్రం రెండు ముక్కలుగా విడిపోయిన తరువాత తెలంగాణ లో టీడీపీ పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింది. పార్టీలో ఉన్న కీలక నేతలు సైకిల్ దిగి తమ దారి తాము చూసుకుంటున్నారు. టీటీడీపీ లో కీలకంగా వ్యవహరించిన రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు కాంగ్రెస్ లోకి వెళ్లడంతో టీడీపీ పరిస్థితి తెలంగాణ లో అసలు బాగాలేదు. ఇక ఆంధ్రప్రదేశ్ లో కూడా దాదాపు అదే పరిస్థితి కనిపిస్తుంది.
గతంలో ఏపీలో ఒక వెలుగు వెలిగించిన పార్టీగా తెలుగుదేశానికి ప్రజల్లో మంచి గుర్తింపు ఉంది. అలాగే పాలనా పరంగా చంద్రబాబు కి కూడా మంచి అనుభవం ఉంది. అదే అనుభవం ఉంది అని చెప్పి రాష్ట్రం విడిపోయిన తరువాత జరిగిన ఎన్నికలలో టీడీపీ అధికారంలోకి వచ్చినా ..ఆ తరువాత జరిగిన కారణాలతో తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికలలో టీడీపీ చరిత్రలో చూడనటువంటి ఘోరమైన ఓటమిని చవిచూసింది. 175 స్థానాలకు గాను కేవలం 23 సీట్లు మాత్రమే గెలుచుకొని .. అతి కష్టం మీద ప్రతిపక్షం హోదాని దక్కించుకుంది.
ఇక అప్పటినుండి టీడీపీ లో కొంచెం టెంక్షన్ కనిపిస్తూనే ఉంది. ఇప్పటికే వల్లభనేని వంశీ పార్టీ కి ఝలక్ ఇచ్చారు. దీంతో ఆయన బాటలో నడిచే ఎమ్మెల్యేలు ఎవరు అనే కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది. దీనితో టీడీపీ ప్రస్తుతం 23 నెంబర్ అంటేనే వణికిపోతోంది. ఏపీ ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు మే 23. టీడీపీకి వచ్చిన ఎమ్మెల్యే సీట్లు 23. కానీ , ఇప్పుడు ఆ సంఖ్య 22 కి చేరింది. అలాగే జగన్ ఒక్క మాట చెబితే ..16 మంది తెలుగుదేశం ఎమ్మెల్యేలు వైసీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి చేసిన ప్రకటన టీడీపీ ని మరింతగా కలవరపెడుతోంది. దీనితో వైసీపీలో టచ్‌లో ఉన్న ఆ పదహారు మంది ఎవరంటూ టీడీపీలో చర్చలు నడుస్తున్నాయి.రాష్ట్రంలో అధికారం పోయిన కొద్ది కాలానికే టీడీపీ నుంచి నలుగురు రాజ్యసభ సభ్యలు సైకిల్ దిగేసారు. ఈ సమయంలో ఉన్న 22 మందిలో నుండి పదహారు మంది జంప్ చేస్తే తెలుగుదేశానికి ఉన్న ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా పోతోంది. దీనితో టీడీపీ లోని కొందరు కీలక నేతలు పార్టీ ఎమ్మెల్యే లతో మాట్లాడుతూ ..భవిష్యత్ మనదే అంటూ చెప్తున్నారనే మాటలు కూడా వినిపిస్తున్నాయి.