తెలంగాణలో ఉప ఎన్నిక జరుగుతన్న హుజూర్‌నగర్‌లో పాలక టీఆరెస్‌కు విజయంపై అనుమానాలు మొదలయ్యాయి. కాంగ్రెస్ సిటింగ్ స్థానమైన అక్కడ విజయం కష్టంతో కూడుకున్న పనే అయినప్పటికీ ఇప్పుడు మరో సమస్య వారిని భయపెడుతోంది. అది గుర్తు గందరగోళం. టీఆరెస్ పార్టీ గుర్తయిన కారును పోలిన ట్రాక్టర్, రోడ్ రోలర్ గుర్తులు కూడా కొందరు ఇండిపెండెంట్ అభ్యర్థులకు కేటాయించడంతో టీఆరెస్‌లో గుబులు మొదలైంది.
టీఆర్ఎస్ మొదటి నుంచి ఈ ఉప ఎన్నికపై ఫోకస్ పెట్టింది. ఆ ప్రాంతంలో ఇప్పటికీ కొంత పట్టున్న సీపీఐతోనూ దోస్తీ కట్టింది. గత ఎన్నికల్లో కేసీఆర్‌ను ఓడిస్తామంటూ చెప్పిన సీపీఐ ఇప్పుడు ఆ పార్టీ అభ్యర్థిని గెలిపించేందుకు రెడీ అయింది. అయితే... పరిస్థితులు ఎంత అనుకూలంగా మార్చుకున్నా కూడా కొన్ని ఇబ్బందులు టీఆరెస్‌ను భయపెడుతున్నాయి. ముఖ్యంగా ట్రాక్టరు, రోడ్‌రోలర్ గుర్తులు వారిని వెంటాడుతున్నాయి. గత ఎన్నికల్లోనూ ఇక్కడ 5000 ఓట్లకు పైగా ట్రక్కు గుర్తుకు పడ్డాయి. దాంతో ఆ ఎన్నికల తరువాత మాజీ ఎంపి వినోద్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. వీటిని తొలగించేందుకు ఈసీ ఆలోచన చేసింది కూడా.
అయితే తాజాగా హుజూర్‌నగర్ ఉప ఎన్నికకు 150కు పైగా నామినేషన్లు దాఖలుకాగా ఉపసంహరణ తదుపరి 28 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్టు ఎన్నికల అధికారులు తేల్చారు. గుర్తులు కూడా కేటాయించారు. టీఆర్ఎస్ అభ్యర్థి శానం సైదిరెడ్డి కి ఈవీఎం మెషీన్లలో నాలుగోస్థానం కేటాయించారు. ఆ తరువాత 5, 6 స్థానాల్లోని ఇండిపెండెంట్ అభ్యర్థులకు ట్రాక్టరు, రోడ్ రోలర్ గుర్తులు కేటాయించారు. కారు గుర్తుకు వేయాలనుకున్న ఓటర్లు కూడా అవగాహలోపం, నిరక్షరాస్యత కారణంగా ట్రక్కు, రోడ్ రోలర్‌కు ఓటేస్తారని భయపడుతున్నారు.