ఒకప్పుడు స్టార్ క్రికెటర్లు.. ఇప్పుడేమో డ్రైవర్లు..కెరీర్ ముగిసాకా అంతా తలకిందులు!
క్రికెట్‌కు మనదేశంలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ లాంటి దేశాల్లోనూ క్రేజ్ ఉంటుంది. ఈ దేశాల్లో క్రికెటర్లు, మాజీ క్రికెటర్లు ఎంతో స్టార్ డమ్ అనుభవిస్తారు. వాళ్ల లైఫ్ కూడా ఎంతో రాయల్‌గా, రిచ్‌గా ఉంటుంది. కానీ అన్ని దేశాల్లో ఈ పరిస్థితి ఉండదు. కొన్ని దేశాల్లో క్రికెట్‌ను అస్సలు ఎవరూ గుర్తించరు. ఆ ఆట ఆడే క్రీడాకారులను ఎవరూ పట్టించుకోరు. ఫలితంగా వాళ్లకు అంత క్రేజ్ ఉండదు.
దీంతో క్రికెట్ ఆడినన్ని రోజులు అంతో ఇంతో ఆదాయం వస్తుంది. కానీ ఒక్కసారి మాజీలు అయ్యారంటే వాళ్ల జీవితాలు దుర్భరంగా మారతాయి. పట్టించుకొనేవాళ్లు ఉండరు.. గతంలో పాకిస్థాన్‌కు చెందిన ఓ మాజీ క్రికెటర్ ఆస్ట్రేలియాలో క్యాబ్ డ్రైవర్ గా ఉపాధి పొందాడు. దీంతో అంతా ఆశ్యర్యపోయారు. తాజాగా శ్రీలంక, జింబాబ్వేకు చెందిన ఆటగాళ్లు సైతం బస్సు డ్రైవర్లుగా బతుకుబండి లాగుతున్నారు. శ్రీలంక జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన సూరజ్ రణదివ్, చింతక జయసింఘే, జింబాబ్వే మాజీ ఆటగాడు వాడింగ్టన్ ఎంవాయెంగా మెల్బోర్న్ నగరంలో ట్రాన్స్ డెవ్ అనే ఫ్రెంచ్ కంపెనీకి చెందిన బస్సులు నడుపుతున్నారు.
ట్రాన్స్ డెవ్ సంస్థ విభిన్న రంగాలకు చెందిన దాదాపు 1,200 మందిని డ్రైవర్లుగా నియమించుకుంది. వారిలో ఈ ముగ్గురు క్రికెటర్లు సైతం ఉన్నారు. ప్రస్తుతం వారు మెల్బోర్న్ లో స్థానికంగా ఓ క్లబ్ తరఫున క్రికెట్ ఆడుతూనే, ఇటు బస్సు డ్రైవర్లుగానూ వ్యవహరిస్తున్నారు.సూరజ్ రణదివ్ వయసు 36 ఏళ్లు. ఇతడో ఆఫ్ స్పిన్ బౌలర్. శ్రీలంక జట్టు తరఫున 12 టెస్టులు, 31 వన్డేలు, 7 అంతర్జాతీయ టీ20 మ్యాచ్ లు ఆడాడు.
రణదివ్ టెస్టుల్లో 43 వికెట్లు తీశాడు. చింతక జయసింఘే శ్రీలంక జట్టు తరఫున 5 అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ల్లో ప్రాతినిధ్యం వహించాడు. జింబాబ్వేకు చెందిన వాడింగ్టన్ ఎంవాయెంగా 2005-06 సీజన్ లో ఒక టెస్టు, 3 వన్డేల్లో జాతీయ జట్టుకు ఆడాడు. జాతీయ జట్టుకు ఆడినవాళ్లు సైతం డ్రైవర్‌గా బతుకీడుస్తుండటం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.