ఏపీలో రాజధానిపై మీ అభిప్రాయమేంటి? తుపాకీ స‌ర్వే ఫ‌లితం ఇదే!

Update: 2021-11-28 04:40 GMT
న‌వ్యాంధ్ర‌లో రావ‌ణ కాష్ఠంగా రుగులుతున్న ఏకైక స‌మ‌స్య రాజ‌ధాని! రాష్ట్రం విడిపోయి.. ఏడు సంవ‌త్స‌రాలు పూర్త‌యినా.. ఇప్ప‌టి వ‌ర‌కు రాజ‌ధాని ఏదీ? అంటూ.. ఒక‌టా? మూడా? అనే ప్ర‌శ్న తెర‌మీదికి వ‌స్తోంది. గ‌త చంద్ర‌బాబు హ‌యాంలో రాష్ట్రం న‌డిబొడ్డున ఉంటుంద‌ని.. పైగా కృష్నాన‌ది వంటి జీవ‌న‌ది ప‌రివాహకంలో ఉంటే.. నీటికి.. ర‌వాణా వ్య‌వ‌స్థ‌ల‌కు ఎలాంటి ఇబ్బంది ఉండ‌ద‌ని.. పైగా రైల్వే, విమానాశ్ర‌యాల‌కు అత్యంత చేరువ‌లో ఉంటుంద‌నే ఉద్దేశంతో అమ‌రావ‌తిని ఎంచుకున్నారు. కేంద్రం కూడా 1500 కోట్ల రూపాయ‌లు ఇచ్చింది. ఏకంగా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ వ‌చ్చి శంకుస్థాప‌న చేసి వెళ్లారు. ఇక‌, కొన్ని భ‌వ‌నాల‌ను చంద్ర‌బాబు హ‌యాంలోనే ప్రారంభించారు. ముఖ్యంగా హైకోర్టు కూడా ఇక్క‌డే నిర్మితం కానుంది.

అయితే.. ప్ర‌భుత్వం మార‌డంతో ప‌నులు ఎక్క‌డిక‌క్క‌డే నిలిచిపోయాయి. అయితే.. అధికారంలోకి వ‌చ్చిన వైసీపీ .. ఎన్నిక‌ల‌కు ముందు.. కానీ.. ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌స‌మ‌యంలో అమ‌రావ‌తిపై స‌భ‌లో జ‌రిగిన చ‌ర్చ‌లో కానీ..ఎక్క‌డా విభేదించ‌లేదు.అయితే..ఏం జ‌రిగిందో ఏమో.. అధికారంలోకి రాగానే కొర్రీలు వేశారు. తొలుత‌.. ఇక్క‌డ ఒక సామాజిక వ‌ర్గానికే ప్ర‌యోజ‌నం ఉంద‌న్నారు. త‌ర్వాత‌.. అసైన్డ్ భూముల‌ను బ‌ల‌వంతంగా తీసుకున్నార‌ని.. అన్నారు. మ‌రోసారి.. ఇక్క‌డ ముంద‌స్తు.. వ్యాపారం చేశార‌ని పేర్కొన్నారు. అస‌లు ఇక్క‌డ రాజ‌ధాని వ‌ద్ద‌ని శివ‌రామ‌కృష్ణ‌న్ క‌మిటీ చెప్పింద‌ని.. త‌ర్వాత చెప్పుకొచ్చారు.

అయితే.. ఎక్క‌డిక‌క్క‌డ‌.. ఏ వాద‌నా కూడా ఫ‌లించ‌లేదు. దీంతో స‌ర్కారు స‌మ‌ర్ధ‌న‌లు తేలిపోతూ వ‌చ్చాయి. అదేస‌మ‌యంలో తెర‌మీదికి తెచ్చిన మూడు రాజ‌ధానుల విష‌యంపై న్యాయ‌ప‌ర‌మైన సంక‌టాలు వ‌చ్చాయి. కానీ, ప్ర‌భుత్వం మాత్రం.. గ‌త రెండున్న‌రేళ్ల‌లో జ‌రిగిన స్థానిక‌, పుర‌పాలిక‌, కార్పొరేష‌న్, ప‌రిష‌త్‌, ఉప ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు త‌మ‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చార‌ని.. సో.. వారంతా .. మూడు రాజ‌ధానుల‌కు అనుకూలంగా ఉన్నార‌ని.. వాదిస్తోంది. ఇదే విష‌యాన్ని ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీలోనూ.. సీఎం జ‌గ‌న్ చెప్పుకొచ్చారు. ఈ నేప‌థ్యంలో అస‌లు ఏయే ప్రాంతాల ప్ర‌జ‌ల మ‌న‌సులో ఏముంది? వారు రాజ‌ధానిపై ఎలా ఆలోచిస్తున్నారు? నిజంగానే ప్ర‌జ‌లు స్థానిక ఎన్నిక‌ల్లో ఇచ్చిన తీర్పు.. మూడు రాజ‌ధానుల‌కు అనుకూలమా? అనే కీల‌క అంశాల‌పై ``తుపాకీ`` ఒక ప్ర‌తిష్ఠాత్మ‌క స‌ర్వే నిర్వ‌హించింది.

దీనిలో మొత్తం 19,486 మంది ప్ర‌జ‌లు అన్ని ప్రాంతాల నుంచి అంటే.. 13 జిల్లాల నుంచి త‌మ అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు. నిర్మొహ‌మాటంగా.. రాజ‌ధాని ఎలా ఉండాలి? ఎక్క‌డ ఉండాల‌నే విష‌యాల‌ను స్ప‌ష్టం చేశారు. వీరిలో మెజారిటీ ప్ర‌జ‌లు 84.53 శాతం మంది అమ‌రావ‌తినే ఏకైక రాజ‌ధానిగా కావాల‌ని కోరుకున్నారు. ప్ర‌పంచ రాజ‌ధానిగా ఇప్ప‌టికే ఏర్పాటు కావ‌డం.. రైతులు ముందుకు వ‌చ్చి.. ప‌చ్చ‌ని తమ పంట పొలాల‌ను త్యాగం చేయ‌డం.. అన్ని జిల్లాల‌కుచేరువ‌లో లేదా.. మ‌ధ్యలో ఉండ‌డం.. పైగా హైద‌రాబాద్‌కు అతి స‌మీపంలో ఉండ‌డం వంటివి రీజ‌న్లుగా పేర్కొంటున్నారు.

ఇక‌, మూడు రాజ‌ధానుల‌కు కేవ‌లం 8.82 శాతం మంది మాత్రం జైకొట్టారు. దీనికి ఎక్కువ మంది వ‌ద్ద‌ని తేల్చారు. మూడు రాజ‌ధానుల వ‌ల్ల అభివృద్ది జ‌ర‌గిన దాఖ‌లాలు ద‌క్షిణాప్రికాలోనూ లేవ‌ని మిగిలిన వారు చెప్ప‌డం గ‌మ‌నార్హం. అయితే.. ఈ 8 శాతం మంది మాత్రం మూడు ఉంటే బాగుంటుంద‌నే అభిప్రాయం వ్య‌క్తం చేశారు.

ఇక‌, విశాఖ ఒక్క‌టే రాజ‌ధానిగా ఉంటే బెట‌ర్ అని 6.66 శాతం మంది ప్ర‌జ‌లు కోరుకున్నారు. ఇప్ప‌టికే ఐటీ న‌గ‌రంగా అభివృద్ధి చెందింది కాబ‌ట్టి పెట్టుబ‌డులు త్వ‌రగా వ‌స్తాయ‌ని వీరు చెబుతున్నారు. కానీ, మిగిలిన 94 శాతం మంది మాత్రం.. ఇది తుఫాన్ల‌కు ప్ర‌సిద్ధి చెందిన న‌గ‌ర‌మ‌ని..పైగా సీమ ప్రాంతానికి క‌డు దూరంలో ఉంద‌ని.. హైద‌రాబాద్‌కు మ‌రింత దూరంగా ఉంద‌ని.. కాబ‌ట్టి.. ఇది సామాన్య ప్ర‌జ‌ల‌కు స‌రికాద‌ని.. అంటున్నారు., మొత్తంగా.. ఈ స‌ర్వేలో అమ‌రావ‌తికే ప్ర‌జ‌లు మొగ్గు చూప‌డం గ‌మ‌నార్హం.

అమరావతి ఏకైక రాజధాని కావాలి = 16,471(84.53%)
మూడు రాజధానులు కావాలి = 1,718(8.82%)
విశాఖపట్నం ఏకైక రాజధాని కావాలి = 1,297(6.66%)
Tags:    

Similar News