ఈ కార్పొరేటర్ ఆస్తి జ‌స్ట్ రూ.650 కోట్లు

Update: 2017-02-09 13:06 GMT
రాజ‌కీయ నాయ‌కుల ఆస్తులు క‌ళ్లు తిరిగి పోయే విధంగా ఉంటాయి. అయితే సాధార‌ణ కార్పొరేటర్‌ ఆస్తికి భిన్నంగా క‌ల్లు చెదిరే రీతిలో ఉంది. బృహత్ ముంబయి పురపాలక(బీఎంసీ) ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఓ కార్పొరేటర్ అభ్యర్థి ఆస్తులు కోట్లలో ఉన్నాయి. కోట్ల ఆస్తులు కలిగిన ఈ అభ్యర్థి బీజేపీకి చెందిన నాయ‌కుడు. మహారాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి ప్రకాశ్ మెహాతాకు సన్నిహితుడైన రియల్టర్ పరాగ్ షా బీఎంసీ ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్నాడు. ఘట్కోపర్ వార్డు నుంచి పోటీ చేస్తున్న షా తన ఎన్నికల ఆఫిడవిట్‌ లో రూ. 690 కోట్ల ఆస్తులు చూపారు. స్థిరాస్తులు రూ. 20 కోట్ల వరకు ఉంటాయని తెలిపారు. ఫిబ్రవరి 21న 227 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

ఈ సందర్భంగా షా మాట్లాడుతూ.. తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని పేర్కొన్నారు. రాజకీయాలు తనకు కొత్త అని తెలిపారు. 22 ఏళ్ల కష్టమే త‌న‌కున్న ఈ ఆస్తులు అని చెప్పారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతానని స్పష్టం చేశారు. ప్రజలకు పారదర్శక పాలన అందిస్తానని పేర్కొన్నారు. ప్ర‌జ‌ల‌కు సేవ చేసేందుకు ఇటు త‌న ఆస్తుల‌తో పాటు స‌మ‌యాన్ని గెలిపిస్తాన‌ని షా  ప్ర‌క‌టించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News