ప్రపంచంలోనే అందరికీ ఆశాకిరణంలా కనిపిస్తున్న బ్రిటన్ లోని ప్రఖ్యాత ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ తయారు చేస్తున్న ‘కరోనా వ్యాక్సిన్’ ట్రయల్స్ లో అనుకోని ఉపద్రవం ఎదురైంది. డిసెంబర్ నాటికి అందుబాటులోకి వస్తుందనుకుంటున్న ఈ వ్యాక్సిన్ ప్రయోగాలకు బ్రేక్ పడింది.
ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ రెండు ట్రయల్స్ ఫుల్ సక్సెస్ అయ్యాయి. దీంతో ప్రపంచమంతా దీనిపైనే ఆశలు పెంచుకుంది కానీ తాజాగా బ్రిటన్ లో మూడో దశ ప్రయోగాల్లో వ్యాక్సిన్ వేయించుకున్న పలువురికి తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తినట్టు సమాచారం. దీంతో మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ను టీకా తయారు చేస్తున్న ఆస్ట్రాజెనెకా ఆపేసింది.
వ్యాక్సిన్ భద్రతపై మరోసారి పూర్తి స్థాయి సమీక్ష నిర్వహిస్తామని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తయారీదారు అయిన ఆస్ట్రాజెనెకా తెలిపింది. అయితే వాక్సిన్ తయారీలో ఇలాంటి సమస్యలు వస్తాయని.. ఇలా జరిగినప్పుడు లొతైన పరిశీలన చేసి తిరిగి ప్రయోగాలను చేస్తామని తెలిపింది.
యూకే, అమెరికా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా దేశాల్లో 30వేల మందిపై ఆక్స్ ఫర్డ్ టీకా మూడో దశ ప్రయోగాలు నడుస్తున్నాయి. ఇంత భారీ స్థాయిలో టీకాను ప్రయోగించడం వల్ల ఫలితాలు మెరుగ్గా ఉంటాయని భావిస్తున్నారు. కానీ తాజాగా ఓ వలంటీరుకు టీకా వికటించడంతో దానిని పరిశీలిస్తున్నారు.