వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కుల కల్లోలం మొదలైనట్లుగా కనిపిస్తోంది. పార్టీలో పదవులన్నీ రెడ్లకేనా అన్న అసహనం కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో వైసిపి విజయభేరి సాధించాలంటే జనాభాలో సగమున్న బిసిలకు సముచిత స్థానం ఇవ్వాల్సిందేనని వైసిపిలోని ఆ సామాజిక వర్గ నేతలు పేర్కొంటున్నారు. రీసెంటుగా పీఏసీ ఛైర్మన్ నియామకం విషయంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఈ కుల కుంపటి మొదలైంది.
పిఏసీ ఛైర్మన్ పదవిలో కర్నూలు జిల్లా డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రరెడ్డిని జగన్ ఎంపిక చేశారు. తొలిసారి గెలిచిన ఆయనకు అంతటి కీలక పదవి ఇవ్వడంపై పార్టీలో చాలామంది అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో రెడ్లకే ప్రాధాన్యమిస్తున్నారు అనడానికి ఇదే ఉదాహరణ అని చెబుతున్నారు. గతంలోనే పిఏసికి ఛైర్మన్ గా భూమానాగిరెడ్డిని ఎంపిక చేయడం, ఇప్పుడు కూడా బుగ్గన రాజేంద్రరెడ్డి ఎంపిక చేసి రెడ్లకే పదవుల్లో అగ్ర తాంబులం ఇస్తున్నారని వైసిపిలోని వివిధ సామాజిక వర్గాలు మండిపడుతున్నాయి. రాయలసీమ జిల్లాలకే అధిక ప్రాధాన్యత దక్కుతోందన్న వాదన కూడా వైసిపిలో మొందలైంది. తద్వార ప్రాంతీయ విభేదాలకు పార్టీలో అవకాశముందన్న అభిప్రాయాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు సీనియర్ నేతలు వాపోతున్నారు. జ్యోతుల నెహ్రుకు పిఏసీ ఛైర్మన్ పదవి దక్కకపోవడంతో కాపు సామాజిక వర్గ నేతలు కూడా మండిపడుతున్నారు.
పీఈసీ చైర్మన్ పదవి రెండు సార్లూ కర్నూలు జిల్లాకే ఇవ్వడంపైనా ఇతర జిల్లాల నేతలు మండిపడుతున్నారు. ప్రాంతీయ సమతుల్యత - కుల సమీకరణలను దృష్టిలో ఉంచుకొని పదవుల పంపకం జరపకుంటే నష్టపోవడం ఖాయమని హెచ్చరిస్తున్నారు.