తెల్లజెండాలు చూపించి శవాలు తీసుకెళ్లిన పాక్ ఆర్మీ

Update: 2019-09-14 09:34 GMT
కొన్నేళ్ల కిందటి వరకు పాకిస్తాన్ కాల్పులు జరిపితే భారత మౌనంగా ఉండేది. చనిపోయిన భారత సైనికులకు నివాళులర్పించేంది. కానీ మోడీ సర్కారు వచ్చాక భారత్ పై పాకిస్తాన్ దాడులను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొడుతోంది. కన్నుకు కన్ను.. బుల్లెట్ కు బుల్లెట్.. చావుకు చావు అన్న రీతిలో భారత సైన్యం సై అంటోంది.తాజాగా భారత ప్రభుత్వం ఆదేశిస్తే పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ ను కూడా స్వాధీనం చేసుకుంటామని భారత ఆర్మీ జనరల్ అన్న మాట పాకిస్తాన్ వెన్నులో వణుకుపుట్టిస్తోంది.

అయితే పాకిస్తాన్ బుద్ది మాత్రం కుక్క తోక వంకర అనే రీతిలోనే ఉంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఈనెల 11న భారత సరిహద్దు గ్రామాలపై బాంబుల వర్షం కురిపించింది.  పీవోకేలోని హాజీపూర్ వద్ద భారత్ లోకి వస్తూ ఓ పాకిస్తాన్ సైనికుడు కాల్పులు జరపడంతో భారత జవాన్ల ప్రతీగా కాల్పులు జరిపాయి. ఈ దాడిలో పాకిస్తాన్ సైన్యానికి చెందిన గులామ్ రసూల్ మృతిచెందాడు. పంజాబ్ లోని బాహవల్ నగర్ కు చెందిన వాడిగా ఇతడిని గుర్తించారు.

అయితే సదురు మృతిచెందిన పాకిస్తాన్ సైనికుడిని తీసుకెళ్లేందుకు పాక్ ఆర్మీ పెద్ద ఎత్తున వచ్చి భారత బలగాలపై కాల్పులు జరుపుతూ మృతదేహం వద్దకు వచ్చారు. అప్రమత్తమైన  భారత్ సైనికులు ప్రతీ దాడి చేయడంతో మరో పాకిస్తాన్ సైనికుడు కూడా మరణించాడు.

దీంతో ఇక భారత్ తో కయ్యానికి కాలుదువ్వితే మరిన్ని మరణాలు తథ్యం అని భావించి వెనక్కి తగ్గిన పాకిస్తాన్ ఆర్మీ.. శాంతికి, లొంగుబాటుకు చిహ్నమైన తెల్లజెండాలు చూపిస్తూ పాకిస్తాన్ సైనికుల మృతదేహాలను తీసుకెళ్లింది.  అయితే పాకిస్తాన్ ఆర్మీ తమ ఇద్దరు సైనికుల శవాలు తీసుకెళ్లాక  మళ్లీ ప్రతీకారం పెద్ద ఎత్తున భారత బలగాలపై మళ్లీ కాల్పులకు తెగబడడం విశేషం.  ఇవాళ ఉదయం జమ్మూకశ్మీర్ లోని హాజీపూర్ సెక్టార్ లో ఈ ఘటన చోటుచేసుకోగా ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఎఎన్ఐ ఆ వీడియోను విడుదల చేసింది. తెల్లజెండా చూపిస్తూ పాకిస్తాన్ సైనికుల శవాలు తీసుకెళ్లిన పాక్ ఆర్మీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


Full View

Tags:    

Similar News