నటుడు దిలీప్​ కుమార్​ ఇంటిపై ‘పాకిస్థాన్​’ కుట్రలు... ఇంతకీ ఏమిటా స్టోరీ..!

Update: 2021-02-07 07:30 GMT
బాలీవుడ్​ నటుడు దిలీప్​ కుమార్​ పూర్వీకులు పాకిస్థాన్​ కు చెందినవారు. దేశ విభజనకు ముందు వాళ్లు పాకిస్థాన్ ​లో ఉండేవారు. అయితే పాకిస్థాన్​ లోని ఖైబర్​ పక్తున్​క్వా ప్రాంతంలో వాళ్లకు ఓ ఇళ్లు ఉంది. ఈ ఇంటిని 15 ఏళ్ల క్రితం హజీ లాల్‌ మహ్మద్..  15 ఏళ్ల కిందటే రూ.51 లక్షలకు కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్న ఇంటి విలువ బహిరంగ మార్కెట్​ లో రూ. 25 కోట్లు ఉంది. కానీ పాకిస్థాన్​ ప్రభుత్వం దీన్ని ఎలాగైన స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నది.

ఇందుకోసం ఈ ఇంటిని వారసత్వ కట్టడంగా గుర్తించింది. ప్రస్తుతం ఆ ఇంటి యజమాని హజీ లాల్​ మహ్మద్​ కు రూ. 80.56 లక్షలు మాత్రం చెల్లించాలని నిర్ణయించింది. అయితే ప్రభుత్వ నిర్ణయంపై ఆ ఇంటి యజమాని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.‘నేను 15 ఏళ్ల క్రితం ఈ ఇంటిని రూ. 50 లక్షలకు కొంటే ఇప్పుడు రూ. 80 లక్షలు మాత్రమే చెల్లించడం కుట్ర. ప్రభుత్వం తక్కువ ధరకే ఈ ఇంటిని కొనేందుకు కుట్రలు చేస్తున్నది’ అంటూ  ఆయన ఆరోపిస్తున్నారు.

ప్రభుత్వ చెప్తున్న మొత్తానికి ఈ భవంతిని అమ్మే ప్రసక్తే లేదని ఆయన పేర్కొన్నారు. 101 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ పురాతన భవనానికి హెరిటేజ్‌ కట్టడంగా పాక్​ గుర్తించింది. దీంతో ఆ ఇంటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి సిద్ధమైంది. ఈ ఇంటిపై ఇంకా ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోలేదు. అయితే దిలీప్​ కుమార్​ కట్టడాన్ని హెరిటేజ్​ కట్టడంగా గుర్తించడం పట్ల మొదట్లో పలువురు హర్షించారు. అయితే ఇప్పడు యజమాని ఆరోపణలతో ఈ భవంతి మరోసారి వార్తల్లోకి ఎక్కింది. భవనానికి  తక్కువ ధర చెల్లించేందుకే పాక్​ హెరిటేజ్​ కట్టడం అని అంటున్నదని ఆ ఇంటి యజమాని ఆరోపిస్తున్నారు.
Tags:    

Similar News