మిరాజ్ పై అటాక్..చేతకాక చతికిలపడిన పాక్

Update: 2019-02-26 08:05 GMT
భారత్ పై దాడికి యత్నించిన పాకిస్తాన్ కు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాదులు మరిన్ని ఆత్మహుతి దాడులు చేస్తారని పక్కా సమాచారంతో ముందస్తుగా భారత్ పీవీకేలోని ఉగ్రవాద స్థావరాలపై దాడికి పాల్పడి ధ్వంసం చేసింది. ఈ దాడిలో 300మంది వరకు ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం అందుతుంది. ఇంకా అధికారిక లెక్క తేలాల్సి ఉంది.

మంగళవారం ఉదయం 3:30గంటలకు ఇండియన్స్ ఎయిర్స్ ఫోర్స్ పాక్ ఉగ్ర శిబిరాలపై మెరుపు దాడులకు పాల్పడింది. 12 మిరాజ్-2000 యుద్ధ విమానాలతో ఉగ్రవాదుల శిబిరాల లక్ష్యంగా దాడికి పాల్పడింది. పాక్ ఉగ్ర సంస్థలకు చెందిన కంట్రోల్ రూములను వెయ్యి కేజీల బాంబులతో ధ్వంసం చేశాయి. ఈ దాడిలో జేషే మహ్మద్ సంస్థకు చెందిన ఉగ్రవాదులు పెద్దసంఖ్యలో హతమయ్యారు.

కాగా భారత్ యుద్ధ విమానాలపై పాకిస్తాన్ ఎఫ్-16 యుద్ధ విమానాలతో దాడికి యత్నించినా ఆ ప్రయోగం పూర్తిగా విఫలమయింది. భారత ఎయిర్స్ ఫోర్స్ పాక్ యత్నాలను సకాలంలో తిప్పికొట్టింది. భారత యుద్ధ విమానాల సామర్థ్యం, సంసిద్ధత చూసి పాక్ వెనక్కి తగ్గినట్టు సమాచారం.

అయితే పాకిస్తాన్ కు మాత్రం తాము ఎదురుదాడికి దిగడంతోనే భారత యుద్ధ విమానాలు వెనక్కి తగ్గాయని చెబుతున్నాయి. దీనిలో ఏమాత్రం వాస్తవం లేదని భారత వాయుసేన స్పష్టం చేసింది. మరోవైపు భారత భూభాగంలోకి ప్రవేశించిన పాక్ నిఘాకు చెందిన డ్రోన్ ను భారత బలగాలు మంగళవారం ఉదయం 6.30గంటలకు గుజరాత్ లోని కచ్ సరిహద్దుల్లో కూల్చివేశారు.


Tags:    

Similar News