హిందూ సంప్రదాయంలో ఏదైనా కొత్త వాహనం కొన్నపుడు అంతా మంచే జరగాలని దానికి జంతు బలివ్వడం చాన్నాళ్లుగా వస్తున్న సంప్రదాయం. కానీ పాకిస్థాన్ లో ఇదే రీతిని ఫాలో అయ్యారు. అయితే అక్కడ మాత్రం ఓ విమానం ముందు మేకను బలి ఇచ్చారు. అది కూడా సరిగ్గా విమానం బయలుదేరే ముందు అందులోని సిబ్బంది దాని ముందు ఓ మేకను బలిచ్చారు.
పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ కు చెందిన ఏటీఆర్-42 ఎయిర్ క్రాఫ్ట్ వారం కిందట క్రాష్ ల్యాండై 47 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత మరో ఏటీఆర్-42 ఎయిర్ క్రాఫ్ట్ తొలిసారి తన కార్యకలాపాలు మొదలుపెట్టే ముందు ఇలా మేకను బలిచ్చారు. ఈ విషయాన్ని ఓ పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్‌కు చెందిన అధికారే వెల్లడించారు! అయితే ఇది మేనేజ్ మెంట్ స్థాయిలో తీసుకున్న నిర్ణయం కాదని ఆయన స్పష్టంచేశారు. మేకను బలిచ్చిన తర్వాత ఏటీఆర్-42 సర్వీస్ ఇస్లామాబాద్ నుంచి ముల్తాన్ కు బయలుదేరింది. వారం కిందట ఏటీఆర్-42 క్రాష్ ల్యాండవడంతో ఆ రకానికి చెందిన అన్ని విమానాలకు షేక్ డౌన్ పరీక్షలు నిర్వహించాలని సివిల్ ఏవియేషన్ అథారిటీ నిర్ణయించింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/