'అన్నా-చెల్లి ప్రేమించుకోగలరా?'.. యూనివర్సిటీ పరీక్షలో షాకింగ్ ప్రశ్న

Update: 2023-02-22 10:33 GMT
యూనివర్సిటీ పరీక్షలో 'అన్నా-చెల్లి ప్రేమించుకోగలరా?' అనే ప్రశ్న అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తుంది పాకిస్థాన్ యూనివర్శిటీ పరీక్షల్లో ఈ ప్రశ్న అందరినీ షాక్ కు గురి చేసింది.. సోదరుడు మరియు సోదరి మధ్య శృంగారం గురించి అభిప్రాయాలపై ఒక వ్యాసంగా అడగడం ప్రశ్న ఇప్పుడు తీవ్ర వివాదాస్పదమైంది. ఇస్లామాబాద్‌కు చెందిన 'కోమ్ సాట్స్' యూనివర్శిటీ ప్రశ్నపత్రంలో అన్నాచెల్లెలు 'జూలీ అండ్ మార్క్ స్కేనారియో' గురించి ఈ ప్రశ్న ఉంది.

చాలా మంది సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, ఇంటర్నెట్ లో ఈ  అసభ్యకరమైన కంటెంట్ ప్రశ్నపై దుమ్మెత్తి పోస్తున్నారు. దీనిపై వైస్‌ ఛాన్సలర్‌, ఛాన్సలర్‌లను ప్రశ్నించాలని డిమాండ్‌ చేశారు.

'ఇలాంటి ప్రశ్న రూపొందించిన దోషులను కార్పెట్‌ కింద వేసి మరీ దుమ్ము దులపండి' అని నటి మిషీ ఖాన్‌ ట్విట్టర్‌లో ప్రశ్నించారు. ఇంత నీచమైన ప్రశ్న వేసిన ఆ మూర్ఖుడిని కాల్చి వేస్తే సరిపోతుందా? యూనివర్సిటీలో ఏం జరుగుతుందో ఉన్నతాధికారులకు తెలియదా? లేక కామ్‌సాట్‌ విశ్వవిద్యాలయం ఆ ప్రశ్న రూపొందించిన ఉపాధ్యాయునిదేనా? అని కడిగేశారు.  ఈ వివాదాస్పద ప్రశ్న రూపొందించిన కోమ్ సాట్స్ యూనివర్సిటీపై ఇప్పుడు సోషల్ మీడియాలో అందరూ విరుచుకుపడుతున్నారు.

ఈ ప్రశ్నకు సంబంధించిన స్క్రీన్‌షాట్ వైరల్‌గా మారింది. గత ఏడాది డిసెంబర్‌లో బ్యాచిలర్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ (బీఈఈ) విద్యార్థులకు ఈ ప్రశ్న ఇవ్వబడింది. ఈ ప్రశ్నకు ''జూలీ మరియు మార్క్ అన్నాచెల్లెళ్లు. వారు కళాశాల నుండి వేసవి సెలవులకు ఫ్రాన్స్‌లో కలిసి ప్రయాణిస్తున్నారు. ఒక రాత్రి వాళ్లు బీచ్ దగ్గర క్యాబిన్‌లో ఒంటరిగా బస చేశారు. శృంగారం చేయడానికి ప్రయత్నిస్తే అది ఆసక్తికరంగా.. సరదాగా ఉంటుందని వారు నిర్ణయించుకున్నారు, ఇది ప్రతి ఒక్కరికీ కొత్త అనుభవం అవుతుంది' అని ఈ ప్రశ్న కొనసాగుతుంది.

జూలీ అప్పటికే గర్భనిరోధక మాత్రలు వేసుకుంది. మార్క్ సురక్షితంగా ఉండటానికి కండోమ్‌ని ఉపయోగించాడు. వారిద్దరూ ప్రేమించుకోవడం ఆనందిస్తారు కానీ మళ్లీ అలా చేయకూడదని నిర్ణయించుకున్నారు. వారు ఆ రాత్రిని ఒక ప్రత్యేక రహస్యంగా ఉంచుతారు.'''

ఈ ప్రశ్నపై వ్యాసం రాయమని విద్యార్థుల అభిప్రాయాలను అడిగారు. వారి స్వంత జ్ఞానం మరియు వ్యక్తిగత అభిప్రాయం నుండి సంబంధిత ఉదాహరణలను కూడా అడిగారు.

ప్రశ్న ఇచ్చిన ఉపాధ్యాయుడిని ప్రొఫెసర్ ఖైర్ ఉల్ బషర్‌గా గుర్తించారు. విచారణ అనంతరం యూనివర్శిటీ అతడిని ఉద్యోగం నుంచి తొలగించి బ్లాక్ లిస్టులో పెట్టింది. ప్రస్తుతం ఈ వివాదం పాకిస్తాన్ లోనే కాదు.. అంతటా తీవ్ర చర్చనీయాంశమైంది.. అందరూ దుమ్మెత్తిపోస్తున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.



Full ViewFull View

Similar News