యూరీ దాడి నేపథ్యంలో భారత్ తమపై యుద్ధం చేసే అవకాశాలున్నాయని పాకిస్థాన్ భావిస్తోంది. దీంతో ఆ దేశం కూడా అందుకు రెడీ అవుతోంది. ఈ విషయాన్ని ఆ దేశం బాహాటంగానే ప్రకటిస్తోంది. భారత్ లో లక్ష్యాలను ఎంచుకున్నామని - అటు నుంచి ఏ చిన్న దాడి జరిగినా బలంగా తిప్పికొడతామని పాకిస్థాన్ హెచ్చరించింది. ఇప్పటికే యుద్ధ ప్రణాళికతో సిద్ధంగా ఉన్నామని పాక్ చెప్పినట్లు జియో టీవీ తన రిపోర్ట్ లో పేర్కొంది. బలగాలను మోహరించామని - యుద్ధం జరిగితే దాడి చేయాల్సిన లక్ష్యాలను కూడా ఎంచుకున్నామని పాక్ రక్షణ వర్గాలు వెల్లడించినట్లు ఆ టీవీ తెలిపింది.
సమీప భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు ఎదురైనా పాకిస్థాన్ సైన్యం వెంటనే రెస్పాండయ్యేలా... రక్షణ సామగ్రిని భారీ ఎత్తున సరిహద్దుల్లోకి తరలిస్తున్నట్లు చెబుతున్నారు. అంతేకాదు... మా సత్తా ఏంటో భారత్ కు తెలుసని కూడా పాక్ హెచ్చరిస్తోంది. దీంతో పాక్ కయ్యానికి కాలు దువ్వుతున్నట్లుగానే ఉంది.
యూరిలో జరిగిన ఉగ్రదాడితో రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారత్ కూడా సరిహద్దులో బలగాలను భారీగా మోహరిస్తోంది. ఓవైపు దౌత్య పరంగా పాక్ పై ఒత్తిడి తెస్తూనే.. మరోవైపు అవసరమైతే తుపాకీతోనూ సమాధానమివ్వడానికి భారత్ సిద్ధమవుతోంది. అయితే.... ఇంతకుముందూ ఇలానే ఒకట్రెండు సార్లు యుద్ధం వరకు వెళ్లినా చివరి నిమిషాల్లో నిర్ణయాలు మార్చుకున్నారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంటుందని చెబుతున్నారు. యుద్ధం జరగకపోవచ్చన్న భావన ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమవుతోంది.