'కన్నతండ్రికి నాలుగో భార్య అయిన కూతురు'... ఇందులో నిజమెంత?

Update: 2023-07-11 08:00 GMT
ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు.. సభ్య సమాజంలో మానవ బంధాలకు విలువ లేకుండా పోయిందనే విషయాన్ని హైలైట్ చేస్తున్నాయని అంటుంటారు. ఇందులో భాగంగా వావి వరసలు మరిచి మానవత్వాన్ని మంట కలుపుతున్నారు కొంతమంది జనాలు! ఫలితంగా… మనుషులు వేరు మృగాలు వేరన్న నీతిని విస్మరిస్తున్నారని అంటున్నారు. ఈ క్రమంలో తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక సంఘటన అసహ్యం కలిగించే సంఘటనగా అనిపిస్తుందనే కామెంట్లను సొంతం చేసుకుంది!

 ఈ మధ్యకాలంలో జరిగే కొన్ని సంఘటనలు చర్చించుకోవడానికి సైతం ఇబ్బందిగా ఉంటాయనడంలో సందేహం లేదు! అందులో భాగంగా... తాజాగా పాకిస్థాన్ లో ఒక సంఘటన తెరపైకి వచ్చిందంటూ కథనాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న కొంతమంది ముక్కున వేలేసుకుంటుంటే.. మరికొంతమంది ముఖం పై ఊసేటంత కోపంగా చూస్తున్నారంటూ కామెంట్లు వెలిసాయి.

అవును.... పాకిస్థాన్‌ కు చెందిన రబియా అనే యువతి తన సొంత తండ్రిని పెళ్లి చేసుకుందని చెబుతూ.. వారిద్దరి ఫోటోలు ఆన్ లైన్ లో వైరల్ చేశారు. దీంతో ఆ ఫోటోలు మానవ సంబంధాలను కాలర్ పట్టుకుని ప్రశ్నిస్తున్నాయనే కామెంట్లు పెరుగుతున్నాయి!

అయితే ఇది పూర్తిగా వాస్తవ విరుద్దం అంటూ కొన్ని "ఫ్యాక్ట్ చెక్" స్టోరీలు ఈ సందర్భంగా జాతియ మీడియాలో దర్శనమిస్తున్నాయి.

"ఒక పాకిస్థానీ మహిళ తన సొంత తండ్రిని వివాహం చేసుకుని, అతని నాలుగవ భార్య అయ్యిందనే వాదన తప్పు. తండ్రికి రెండో కూతురైన మహిళ.. భర్తనే పెళ్లి చేసుకున్నానని స్పష్టం చేసింది. ఆమె పేరు, పుట్టిన క్రమం మధ్య సాంస్కృతిక అనుబంధం నుండి ఈ విషయం మరోలా బయటకు వచ్చింది" అని నేషనల్ మీడియా కథనాలు ప్రచురించింది!

ఇదే సమయంలో సోషల్ మీడియా ప్లాట్‌ ఫారమ్‌ లలో ప్రసారం అవుతున్న వైరల్ వీడియోలు లేదా ధృవీకరించబడని క్లెయిమ్‌ ల ఆధారంగా తీర్మానాలు చేయడానికి ముందు జాగ్రత్త వహించమని సూచిస్తూ... సమాచారాన్ని ధృవీకరించడం చాలా ముఖ్యమని చెబుతుంది!

దీంతో... తండ్రిని పెళ్లిచేసుకున్న కూతురు స్టోరీ అసత్యమని జాతీయ మీడియా సంస్థలు కొన్ని కథనాలు ప్రసారం చేస్తూ.. ఈ విషయంపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నాలు చేసిందని అంటున్నారు పరిశీలకులు!

Similar News