భారతీయ సెల్బ్రిటీల ఫోటోలను మార్ఫింగ్ చేసి వాటితో ఆన్ లైన్ లో ప్రచారం చేపట్టింది పాకిస్తాన్ కు చెందిన ఒక సంస్థ. కశ్మీర్ లో అల్లర్లు సృష్టిస్తున్నవారిపై పోలీసు పెల్లెట్ గన్ ల ప్రయోగించడాన్ని వ్యతిరేకిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది. ఈ మార్ఫింగ్ చేసిన ఫోటోల జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ సహా బాలీవుడ్ నటీనటులు - క్రీడాకారులు ఉన్నారు. సోనియా గాంధీ - అమితాబ్ బచ్చన్ - షారుఖ్ ఖాన్ - ఐశ్వర్యారాయ్ - కాజోల్ - సైఫ్ అలీ ఖాన్ - అలియా - విరాట్ కోహ్లీ - హృతిక్ రోషన్ తదితర ప్రముఖుల ఫోటోలతో పెల్లెట్ గన్ ల వినియోగాన్ని వ్యతిరేకిస్తున్నట్లు పోస్టులలో రాశారు. అయితే ఈ ఫోటోలకు పెల్లెట్ గన్ ల కారణంగా గాయాలైనట్లు మార్ఫింగ్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
ఫోటోలను చూపించి పాక్ సంస్థ ఏమి చెప్పాలనుకుంటుంది అనేది బహిరంగ రహస్యమే అయినా.. దీనిపై పాక్ అధికారికంగా స్పందించలేదు! కశ్మీర్ ప్రజలపైనా - ఉగ్రవాదులను సమర్ధిస్తున్న కశ్మీర్ లోని ఒకవర్గం వారిపైనా పాక్ కి ఉన్న ప్రేమేమిటో ప్రపంచానికి తెలిసిందే. అయితే కశ్మీర్ కల్లోలంపై పాక్ ఇప్పటికే వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ వ్యాఖ్యల అనంతరం ఈ ఫోటోలు ఆన్ లైన్ లో విడుదలవ్వడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది.
అయితే పాక్ వ్యాఖ్యలపై స్పందించిన కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్.. జమ్మూకశ్మీర్ ప్రజలల్లో టెర్రరిజాన్ని ప్రోత్సహించే విధంగా పాకిస్థాన్ వ్యాఖ్యలను చేయకూడదని, రాష్ట్రంలో శాంతిని నెలకొల్పేందుకు చర్చలకు సిద్ధమని ప్రకటించారు. కాగా ఈనెల 8న టెర్రరిస్టు బుర్హాన్ కాల్చివేత అనంతరం రాజుకున్న కల్లోలంలో ఇప్పటివరకు 45మంది మరణించారు.