పాకిస్థాన్ మ‌హిళ హానీ ట్రాప్‌.. మ‌న శాస్త్ర‌వేత్త అడ్డంగా బుక్క‌య్యాడు!

Update: 2023-07-08 19:00 GMT
హ‌నీ ట్రాప్‌.. వ‌ల‌పు వ‌ల‌కు చిక్కుకోకుండా.. ఉండ‌డం అంత ఈజీకాదని అంటారు. ఇప్పుడు అదే జ‌రిగింది. అది కూడా మ‌న దేశానికి చెందిన డీఆర్‌డీవో శాస్త్ర‌వేత్త‌.. కావ‌డం గ‌మ‌నార్హం. అటు వైపు వారు మ‌న దాయాది శ‌తృ దేశం.. పాకిస్థానం. పాకిస్థాన్ మ‌హిళ క‌న్ను గీట‌గానే ప‌డిపోయాడు. దేశానికి సంబంధించిన అత్యంత కీల‌క‌మైన ర‌క్ష‌ణ ర‌హ‌స్యాల‌ను చెప్పేసి అడ్డంగా బుక్క‌య్యాడు.

డీఆర్ డీవోకు చెందిన ప్ర‌దీప్ కురుల్క‌ర్‌(44 ఏళ్ల వ‌య‌సు) ప్ర‌ముఖ శాస్త్ర‌వేత్త‌గా ఎదిగారు. ఈయ‌నకు భారత రక్షణ రంగానికి చెందిన అత్యంత రహస్యమైన క్షిపణి సమాచారం దాదాపుగా అంతా తెలుసు.

అయితే.. ఈయ‌న వ‌య‌సు ప్ర‌భావ‌మో.. లేక వ‌ల‌పు తీపి ఆవ‌రించిందో తెలియ‌దు కానీ.. పాకిస్థాన్ నిఘా ఏజెంట్‌గా ఉన్న ఓ మ‌హిళ క‌న్నుగీట‌గానే ఆమె ఒడిలో వాలిపోయాడు. అంతేకాదు.. ఈ మురిపెంలో ఆమె చెప్ప‌మ‌న్న‌వ‌న్నీ.. చెప్పేశాడు.

ఆ వ‌గ‌లాడి పేరు ఏదైనా కూడా ఇండియ‌న్ నేటివిటీ ఉన్న పేరు.. జారా దాస్ గుప్తాగా ప‌రిచ‌యం అయిం ది. ఈ క్రమ‌లో త‌న‌ను తాను తానో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అని యూకేలో పనిచేస్తున్నానని చెప్పింది. ఆ తర్వాత న్యూడ్  వీడియోలు, సెక్స్‌ మెసేజ్‌లు పంపి ప్రదీప్‌ను రెచ్చ‌గొట్టింది. అంతే మ‌న శాస్త్ర‌వేత్త నిజ‌మ‌నుకున్నారు. ఆమెతో వాట్సాప్‌లో వాయిస్‌, వీడియో కాల్స్ పంచేసుకున్నారు.

ఈ క్రమంలోనే భారత క్షిపణి వ్యవస్థకు చెందిన అత్యంత రహస్య సమాచారం, రక్షణ రంగ ప్రాజెక్టుల గురించి సమాచారం ఇచ్చేశాడు. ఎట్ట‌కేల‌కు ఈ విష‌యాన్ని ప‌సిగ‌ట్టిన మహారాష్ట్ర యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ ఇటీవ‌ల ఆయ‌న‌ను అరెస్టు చేసి.. తాజాగా ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది.

డ్రోన్లు, క్షిపణులు, బ్రహ్మోస్‌, అగ్ని మిసైల్‌ లాంఛర్లు, యూసీవీ, మిలిటరీ బ్రిగేడింగ్‌ సిస్టమ్‌ వంటి పలు రక్షణ రంగ ప్రాజెక్టుల గురించి వీరిద్దరూ చాటింగ్‌ చేసినట్లు పోలీసులు గుర్తించారు.

Similar News