పాలమూరు ఫిష్ తినేవారు ఇదొకసారి చూడండి...

Update: 2019-10-29 01:30 GMT
డబ్బు కోసం వ్యాపారాలు ప్రస్తుతం తినే తిండిని కూడా కల్తీ చేసేస్తున్నారు. ముఖ్యంగా ఈ దందా నాన్ వెజ్ లో ఎక్కువగా సాగుతుంది. చికెన్  - మటన్ కంటే చేపలు అన్ని విధాలా ఆరోగ్యానికి మంచిది కావడం తో ఈ మధ్య నగరవాసులు చేపల వైపు మనసు పారేసుకుంటున్నారు. ఇదే అదునుగా భావించిన వ్యాపారులు చేపల దందా మొదలుపెట్టేసారు. మనం మార్కెట్ లో నిగనిగలాడే చేపలు కనిపించగానే తీసుకోవాలని అని అనుకుంటాం. కానీ , ఆ చేపలు ఎక్కడినుండి వచ్చాయి ..వాటిని ఏవిదంగా పెంచారో తెలుసుకుంటే మళ్ళీ జీవితంలో చేపల జోలికే  వెళ్ళరు.  ముఖ్యంగా పాలమూరు జిల్లా నుండి  క‌ష్ణా నదీ పరివాహక ప్రాంతం నుంచి వచ్చిన చేపలు తింటే మాత్రం మిమ్మల్ని మీరు మరచిపోవాల్సిందే... 

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కృష్ణానదీ పరీవాహక ప్రాంతాల్లో గుట్టుచప్పుడు కాకుండా సాగుతోందీ దందా. కృష్ణానది తీరంలో గత 12 సంవత్సరాలుగా  ఈ దందా సాగుతుంది. గతంలో ఈ చెరువుల్లో పెద్ద ఎత్తున క్యాట్ ఫిష్ పెంచే వారు…వాటి పెంపకంపై నిషేధం విధించడంతో ఆ చెరువుల్లో ప్రస్తుతం ఇతర చేపలు పెంచుతున్నారు. చెరువుల్లో - నదుల్లో చేపలైతే వాటికి నచ్చిన రకరకాల సహజమైన ఆహారాన్ని తింటాయి. సహజసిద్ధంగా పెరుగుతాయి. కానీ కృత్రిమంగా ఏర్పాటు చేసిన చెరువుల్లో చేపలకు అలాంటి ఆహారం దొరకదు కాబట్టి నిర్వాహకులు దాణా వేస్తారు. కానీ , నిజమైన దాన వేస్తే లాభం తక్కువగా వస్తుంది అని భావించి .. హైదరాబాద్ - కర్నూలు వంటి నగరాల నుంచి చికెన్ వేస్టును తెచ్చి వాటిని ఉడకబెట్టి..ఆతర్వాత చేపలకు వేస్తున్నారు. ఉడకబెట్టిన కోళ్ల పేగులు - కాళ్లు - తలలను అవి చక్కగా తినేస్తున్నాయి. దీని వల్ల వ్యాపారికి దాణా ఖర్చు తగ్గుతుంది. చేప త్వరగా పెరిగి వస్తుంది.

కానీ ఆ వ్యర్థాలను తిని పెరిగిన చేపను తింటే మనుషులకు రోగాలు తప్పవు.  జోగులాంబ గద్వాల - వనపర్తి జిల్లాల్లో ఈ దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. స్థానికుల నుంచి అధికారుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమైనప్పటికీ వ్యాపారుల్లో మాత్రం మార్పు రావడం లేదు. మరో వైపు అధికారులు నామమాత్రంగా  చర్యలు తీసుకుంటున్నారనే  ఆరోపణలు కూడా ఉన్నాయి. కొంతమంది మేము ఎటువంటి వెస్ట్ వేయడం లేదు అని చెప్తున్నా ..మరికొంతమంది మాత్రం చికెన్ వ్యర్థాలను ఉడకబెట్టి చేపలకు మేతగా వేస్తున్నామని బాహాటంగానే చెప్తున్నారు. ఏమైనా కూడా మీరు చేపలు తినాలని భావిస్తే ..ఆ చేపలు ఎక్కడినుండి వచ్చాయి ..ఎలా పెరిగాయో వివరాలు తెలుసుకొని తీసుకుంటే మీ ఆరోగ్యానికి ఎటువంటి డోఖా ఉండదు.
Tags:    

Similar News