తెలంగాణః టీఆర్ ఎస్‌ కు మ‌రో గుడ్ న్యూస్‌

Update: 2016-04-19 16:14 GMT
తెలంగాణ‌లో మ‌రో ఉప ఎన్నిక నోటిఫికేష‌న్ విడుద‌లైంది. ఖ‌మ్మం జిల్లా పాలేరు నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికల షెడ్యూల్ తాజాగా వెలువ‌డింది. ఈ నెల 22న ఉపఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నెల 29న నామినేషన్లకు చివరి తేదీ. 30న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు మే 2వతేదీ. మే 16న పాలేరు ఉప ఎన్నిక పోలింగ్ జరుగుతుంది. మే 19న ఓట్ల లెక్కింపు ఉంటుందని ఎన్నికల కమిషన్ ప్రకటించింది.

ఇటీవ‌ల వ‌రుస ఎన్నిక‌ల విజ‌యాల‌తో దూకుడులో ఉన్న టీఆర్ ఎస్ పార్టీ పాలేరు ఉప ఎన్నిక‌లో కూడా త‌మ పార్టీయే గెలుపొందుతుంద‌ని విశ్వాసం వ్య‌క్తం చేస్తోంది. అయితే ప్ర‌తిప‌క్ష పార్టీలు మాత్రం త‌మ‌కు విజ‌యం ఖాయ‌మ‌ని చెప్తున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే మ‌ర‌ణంతో ఇక్క‌డ ఉప ఎన్నిక వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.
Tags:    

Similar News