ఏపీ పంచాయతీ ఎన్నికలు కాకరేపుతున్నాయి. ఎస్ఈసీ నిమ్మగడ్డ, వర్సెస్ ఏపీ ప్రభుత్వం పోరులో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంటోంది. టీడీపీ, వైసీపీ మధ్య పంచాయితీ పోరు పీక్స్ కు చేరింది. ఏపీ పంచాయతీ ఎన్నికల నామినేషన్లు నేటితో ముగియనున్నాయి. ఇవాళ సాయంత్రం ఐదింటి వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు అధికారులు.
ఇప్పటి వరకు సర్పంచ్ పదవులకు 8773 నామినేషన్లు దాఖలు అయ్యాయి. రేపు దాఖలైన నామినేషన్లను పరిశీలించనున్నారు. నిన్న ఒక్కరోజే సర్పంచ్ పదవులకు 7460 నామినేషన్లు దాఖలు అయ్యాయి. 25519వార్డు మెంబర్ పదవులకు నామినేషన్లు దాఖలయ్యాయి. ఈరోజు సాయంత్రం 5 గంటల వరకూ అభ్యర్ధ్యులు నామినేషన్లను దాఖలు చేయవచ్చు. ఈ నేపథ్యంలో కొన్నిచోట్ల ఉద్రిక్తతల నడుమ నామినేషన్లు కొనసాగుతున్నాయి.
ఏపీలోన పలు ప్రాంతాల్లో అధికారులు ఏకపక్షంగా నిర్వహిస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. ఎన్నికల కోడ్ ను పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ప్రభుత్వ కార్యక్రమాలను యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు. తాజాగా విశాఖ జిల్లా మునగపాక మండలంలో ఎన్నికల కోడ్ నిబంధనలను ఉల్లంఘించారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. తహసీల్దార్ కార్యాలయంలోనే ఇదంతా జరగడంపై ప్రతిపక్ష నేతలు విమర్శలు చేస్తున్నారు.మరోవైపు తొలి దశ ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియతో ముగియనుంది.
ఇక పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పలు చోట్ల చిన్నపాటి గొడవలు అయినట్లు తెలుస్తోంది. అధికారులు మొదటి విడత ఎన్నికల ప్రక్రియను సంక్రమంగా నిర్వహిస్తున్నారు. అటు కొన్ని పార్టీలు ఏకగ్రీవాల కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాయి. మరి కొన్ని చోట్ల సర్పంచ్ పదవుల వేలం పాట కూడా నిర్వహించిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి.