నాటకీయ పరిణామాల మధ్య ఏపీలో పంచాయితీ ఎన్నికలు జరుగుతాయా? లేదా? అన్న సందేహాలకు దేశ అత్యున్నత న్యాయస్థానం తెర దించిన సంగతి తెలిసిందే. ఏపీలో స్థానిక ఎన్నికల్ని నిర్వహించాలని ఆదేశించటంతో.. ఎన్నికల ప్రక్రియ షురూ అయ్యింది. ఇలాంటి వేళ.. ఏపీ సర్కారు ఆసక్తికర ప్రకటనను జారీ చేసింది. తాజాగా జరిగే స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయితీలకు భారీగా నజరానాను ప్రకటించింది.
గత ఏడాది ఏకగ్రీవాలకు ప్రభుత్వం నజరానా ప్రకటించటంతో.. ఆయా గ్రామాల్లో ఏకగ్రీవాలకు ఎక్కువ మొగ్గు చూపే వీలుందంటున్నారు. ఏకగ్రీవాలైన పక్షంలో ఎన్నికల ఖర్చు తగ్గటంతో పాటు.. అనవసరమైన ఉద్రిక్తతలకు అవకాశం ఉండదు. ఇక.. ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వు ప్రకారం.. రెండు వేల లోపు జనాభా ఉన్న పంచాయితీలకు రూ.5 లక్షల ప్రోత్సహకాన్ని అందిస్తామని ప్రకటించారు.
అదే సమయంలో 2 వేల నుంచి 5 వేల జనాభా ఉన్న పంచాయతీలకు రూ.10లక్షలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఇక.. ఐదు వేల నుంచి పది వేల లోపు జనాభా ఉన్న పంచాయితీకి రూ.15లక్షలు ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఇక.. పదివేలకు పైగా జనాభా ఉన్న పంచాయితీల్లో ఏకగ్రీవంగా ఎన్నిక పూర్తి అయితే.. ప్రభుత్వం రూ.20వేల ప్రోత్సహాకాన్ని అందివ్వనున్నారు. మరి.. ప్రభుత్వం ప్రకటించిన ప్రోత్సహాకాల ప్రభావం ఎన్నికల ఏకగ్రీవాల మీద ఎంత మేర ఉంటుందో చూడాలి.