హద్దులు దాటిపోతున్న వివాదాలు

Update: 2021-02-01 11:30 GMT
దేశంలో మరే రాష్ట్రంలో లేనట్లుగా రాష్ట్రంలో రెండు రాజ్యాంగబద్దమైన వ్యవస్ధల మధ్య వివాదాలు అన్నీ హద్దులు దాటిపోతున్నాయి. సుప్రింకోర్టు తీర్పుతో ఎన్నికల నిర్వహణకు పూనుకున్న స్టేట్ ఎలక్షన్ కమీషనర్ అదే ఊపులో ఇష్టమొచ్చినట్లు అందరి మీద ఫిర్యాదులు చేస్తున్నారు. కొందరినీ బాధ్యతల నుండి తప్పించాలని, మరికొందరినీ పదవుల్లో నుండి తప్పించాలని చీఫ్ సెక్రటరీకి రాసిన లేఖలు బాగా వివాదాస్పదమయ్యాయి.

ఇవి సరిపోవన్నట్లుగా మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్సా సత్యనారాయణలపై యాక్షన్ తీసుకోవాలంటూ ఏకంగా గవర్నర్ కే లేఖ రాయటం సంచలనంగా మారింది. నిమ్మగడ్డ తన చేతిలో ఉన్న అస్త్రాలను ప్రభుత్వానికి వ్యతిరేకంగా సంధిస్తుంటే ప్రభుత్వం కూడా నిమ్మగడ్డపై అస్త్రాలు సంధించటం మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే ఇద్దరు మంత్రులు నిమ్మగడ్డ పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. నిజంగానే నిమ్మగడ్డపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వటమంటే అసాధారణమనే చెప్పాలి.

నిజానికి రాష్ట్రంలో జరుగుతున్న ఈ పరిణామాలు దురదృష్టకరమనే చెప్పాలి. రాజ్యాంగం చెప్పినట్లే తాను నడుచుకుంటున్నానని, రాజ్యాంగబద్దమైన అధికారాలు తనకు ఉన్నాయని నిమ్మగడ్డ చెప్పుకుంటున్నారు. అయితే ప్రభుత్వం కూడా రాజ్యాంగబద్దంగానే ఏర్పడిందన్న విషయం మరచిపోతున్నారు. తనకు కొన్ని అధికారాలను ఇచ్చిన రాజ్యాంగమే జగన్మోహన్ రెడ్డికి కూడా ఇచ్చిందని గుర్తించటం లేదు.

మొన్నటి మార్చిలో జరుగుతున్న ఎన్నికలను ప్రభుత్వంతో చెప్పకుండానే ఏకపక్షంగా వాయిదా వేసినట్లు చేసిన ప్రకటన వల్ల రాష్ట్రంలో ఇఫుడింత కంపు జరుగుతోంది. అప్పట్లోనే నిమ్మగడ్డ ఆ తప్పు చేయకుండా ప్రభుత్వంతో మాట్లాడిన తర్వాతే ముందుకెళ్ళుంటే ఇపుడింత కంపు ఉండేదికాదేమో. తరచూ రాజ్యాంగాన్ని ప్రవచిస్తున్న నిమ్మగడ్డ తన విధులను, బాధ్యతలను సక్రమంగానే నిర్వర్తించారా అంటే మాత్రం సమాధానం చెప్పటం లేదు.
Tags:    

Similar News