ఎన్నికల కమీషన్ రూపొందించిన ఎన్నికల యాప్ ఈ-వాచ్ పై అనేక వివాదాలు మొదలయ్యాయి. సరే ఎన్ని వివాదాలున్నా స్టేట్ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అయితే యాప్ ను విడుదల చేశారు. అయితే యాప్ వినియోగంపై ప్రభుత్వం కోర్టులో కేసు వేసింది. లంచ్ మోషన్లో అత్యవసర విచారణకు ప్రభుత్వం అడిగినా కోర్టు మాత్రం కేసును గురువారం విచారిస్తామని చెప్సింది.
విచారణలో కోర్టు ఏమి తేలుస్తుందన్నది వేరే విషయం. అయితే నిమ్మగడ్డ పైన కూడా ఇక్కడ బాధ్యతుంది. అదేమిటంటే ఒక రాజకీయపార్టీగా అధికారపార్టీ అనేక సందేహాలను లేవనెత్తింది. నిమ్మగడ్డ చెప్పిన యాప్ టీడీపీ వాళ్ళు తయారుచేసిన యాప్ అని అధికారపార్టీ నేతలు బాహాటంగానే ఆరోపిస్తున్నారు. వాళ్ళ ఆరోపణలకు నిమ్మగడ్డ వ్యవహారశైలి కూడా కారణమే.
నిజానికి కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఎన్నికల కోసం వాడుతున్న యాప్ లను కాదని నిమ్మగడ్డ ప్రత్యేకించి ఓ యాప్ తయారు చేయించాల్సిన అవసరం ఏమొచ్చింది ? రాష్ట్రప్రభుత్వం ఆద్వర్యంలోని యాప్ ను వాడటం ఇష్టంలేకపోతే కేంద్రప్రభుత్వం రూపొందించిన యాప్ ను వాడవచ్చు. అలాకాకుండా తానే ఎవరికీ తెలీకుండా సీక్రెట్ గా ఓ యాప్ తయారు చేయించిన కారణంగానే వైసీపీ నేతలు యాప్ పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
సరే తానే ప్రత్యేకంగా యాప్ ను తయారు చేయించినా వైసీపీ నేతలు లేవనెత్తిన అంశాలపై సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత నిమ్మగడ్డపైనే ఉంటుంది. వైసీపీ సందేహాలను లేవనెత్తింది కాబట్టి కొందరిని పిలిపించుకుని వాళ్ళ సందేహాలను నివృత్తి చేసుంటే బాగుండేది. అలా కాకుండా అంతా నాఇష్టం అన్నట్లుగా వ్యవహరించబట్టే ప్రభుత్వం యాప్ వినియోగానికి వ్యతిరేకంగా కోర్టులో కేసు వేసింది. ఇదే విషయమై ప్రభుత్వం కోర్టులో కేసు వేయకపోతే ఆశ్చర్యం కానీ వేస్తే ఆశ్చర్యమేముందని వెటకారంగా మాట్లాడారు. మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిమ్మగడ్డ చేస్తున్నది కూడా అదే కదా.