స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వైఖరి చాలా విచిత్రంగా ఉంది. తాను ఏమి చెబితే అది జరిగిపోవాలంతే అన్నట్లుగా ఉంది ఆయన వ్యవహారం. తాజాగా పంచాయితీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమీషనర్ గిరిజాశంకర్ తో భేటి సందర్భంగా నిమ్మగడ్డ మాట్లాడిన తీరే ఆయన మనస్తత్వం ఏమిటో చెప్పేస్తోంది. పంచాయితీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు మెంబర్ల నామినేషన్ దాఖలు విషయంలో ఆన్ లైన్ సౌకర్యం కల్పించలేదంటూ పై ఇద్దరు అధికారులపై నిమ్మగడ్డ విరుచుకుపడ్డారు.
మొదటిదశ నామినేషన్లకు ముందే తాను ఆన్ లైన్ విధానంపై ఆదేశాలు ఇచ్చినా ఎందుకు ఏర్పాట్లు చేయలేదంటూ వాళ్ళిద్దరినీ నిలదీశారు. ఆన్ లైన్లో నామినేషన్లు తీసుకునే విధానాన్ని ప్రవేశపెట్టాలంటే అందుకు చట్ట సవరణ అవసరమని అధికారులు బదులిచ్చారు. అయితే వాళ్ళ సమాధానంతో నిమ్మగడ్డ శాంతించలేదు. చట్ట సవరణ లాంటి సమాధానాలు చెప్పవద్దని చెబుతునే రెండోదశ నామినేషన్లకు ఆన్ లైన్ విధానాన్ని అమల్లోకి తేవాల్సిందే అంటూ రెచ్చిపోయారు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ద్వివేది, గిరిజా శంకర్ అంటేనే నిమ్మగడ్డ మండిపోతున్నారు. వాళ్ళిద్దరిని తాను అభిశింసిస్తు ఇఛ్చిన ఆదేశాలను చీఫ్ సెక్రటరీ బుట్టలో పడేశారు. ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులను అభిశంసిస్తు ఆదేశాలిచ్చే అధికారం నిమ్మగడ్డకు లేదని చీఫ్ సెక్రటరీ తేల్చేశారు. అంతే కాకుండా నిమ్మగడ్డ ఆదేశాలను ఢిల్లీలోని (డీవోపీటీ) డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ ఉన్నతాధికారులకు లేఖరాశారు. అప్పటి నుండి వీళ్ళిద్దరిపై నిమ్మగడ్డ మంట మరింతగా పెరిగిపోయింది.
వాళ్ళపై పెరిగిపోతున్న మంటను తన దగ్గరకు పిలిపించుకుని తీర్చుకుంటున్నట్లుంది. ఆన్ లైన్ విధానంలో నామినేషన్లు తీసుకునే ప్రక్రియ మొదలుపెట్టాలంటే పంచాయితీ రాజ్ చట్టంలో సవరణలు చేయాలని చెప్పినా వినిపించుకోవటం లేదు. చట్ట సవరణ అన్నది అధికారుల చేతిలో ఉండదు. ముఖ్యమంత్రి తలచుకుంటనే చట్ట సవరణ సాధ్యమవుతుంది. అంటే ఎన్నికలు ఎన్ని దశల్లో జరిగినా చట్ట సవరణ చేయకపోతే ఆన్ లైన్ విధానం సాధ్యం కాదంటే సాధ్యం కాదంతే. ఇంతచిన్న విషయం తెలిసి కూడా నిమ్మగడ్డ ఇద్దరు సీనియర్ అధికారులపై మండిపడితే ఏమొస్తుంది.