ఏపీలో మొదటి దశ పోలింగ్‌కు మరో రెండురోజులు మాత్రమే గడువు ఉంది. ఈనెల 9న ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థులు ప్రలోభాలకు తెరలేపారు. పంచాయతీ ఎన్నికలంటేనే ప్రలోభాల పర్వం ఉంటుంది. అభ్యర్థి ప్రతి ఓటరును కలుసుకొనే అవకాశం ఉంటుంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా తొలిదశ పోలింగ్ ఉన్న చాలా గ్రామాల్లో డబ్బు, మద్యం ఏరులై పారుతున్నది. ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని ఎన్నికల సంఘం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నది.
అయినప్పటికీ అభ్యర్థులు మాత్రం గుట్టు చప్పుడు కాకుండా ప్రలోభాలకు తెరలేపారు. చాలా చోట్ల చీరలు, వంట సామగ్రి పంచుతున్నట్టు సమాచారం. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం గూట్లపాడు పంచాయతీ పరిధిలో పోలీసులు భారీగా ప్రెషర్ కుక్కర్లు స్వాధీనం చేసుకున్నారు. ఓ సర్పంచ్ అభ్యర్థి వీటిని ఓటర్లుకు పంచేందుకు తీసుకొచ్చినట్టు సమాచారం. గూట్లపాడు గ్రామంలోని ఓ ఇంట్లో దాచి ఉంచిన దాదాపు 50 ప్రెషర్ కుక్కర్లను పంచాయతీ ఎన్నికల స్పెషల్ స్క్వాడ్ టీం పట్టుకున్నట్టు సమాచారం.
వీటిని స్వాధీనం చేసుకున్న అధికారులు భీమవరం పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ కుక్కర్లు ఎవరికి సంబంధించినవి అన్న విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఓటర్లను ప్రలోభపెట్టే డబ్బు, మద్యం, ఇతర వస్తువులు ఎవరైన పంచినట్టు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల కమిషన్, అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ ఎన్నికల్లో సత్తా చాటాలని అధికార వైఎస్సాఆర్ కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తున్నది. మరోవైపు ఉనికిని కాపాడుకోవడం కోసం టీడీపీ ప్రయత్నిస్తున్నది.
ఎలాగైనా కొన్ని గ్రామాల్లోనైనా గెలుపొంది.. సత్తా చాటాలని టీడీపీ చూస్తున్నది. అయితే ఆ పార్టీకి చెందిన కీలక నేతలు సొంత గ్రామాల్లో గెలుపొంది పరువు దక్కించుకోవాలని టీడీపీ ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. సహజంగానే స్థానికసంస్థల ఎన్నికలు అధికార పార్టీకే ఎక్కువ మొగ్గు ఉంటుంది. ఈ నేపథ్యంలో రాజకీయాలకు అతీతంగా జరిగే ఈ ఎన్నికల్లో పార్టీల మద్దతుతోనే అభ్యర్థులు బరిలో ఉంటారు.