ఏపీలో జరుగుతున్న పంచాయితీ ఎన్నికల ఫలితాలు గందరగోళంగా మారుతుున్నాయి. గెలిచిన వారు తమ పార్టీకి చెందిన వారంటూ అధికార.. విపక్ష పార్టీలు క్లెయిం చేసుకుంటున్నాయి. మొదటి.. రెండో విడతలోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది. మూడో విడతలోనూ సేమ్ సీన్ రిపీట్ గా మారింది. పార్టీ గుర్తు లేకుండా అభ్యర్థి పేరు.. వారికి కేటాయించిన గుర్తులతో జరిగే పంచాయితీ ఎన్నికల్లో.. గెలిచిన వారు తమ పార్టీ మద్దతుదారుగా ఆయా పార్టీలు చెప్పుకుంటున్నాయి. దీంతో.. ఎవరికి ఎన్ని స్థానాలు అన్న విషయంలో ఎవరి లెక్కలు వారివి అన్నట్లుగా మారింది.
తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందని.. కుప్పంలోనూ బాబుకు దారుణమైన పరాభవం ఎదురైనట్లుగా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో పూర్తిగా బలహీనపడిందని.. ఇక ఆ పార్టీ ఉనికి ప్రశ్నార్థకమన్నట్లుగా అధికార పార్టీ నేతలు చెబుతుంటే.. విపక్ష టీడీపీ మాత్రం అందుకు భిన్నమైన వాదనను వినిపిస్తోంది. తాజా ఎన్నికలు తమ బలాన్ని స్పష్టం చేస్తున్నాయని.. అధికారపక్షం ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా.. ఒత్తిళ్లు తెచ్చినా.. తమ పార్టీ మద్దతుదారులు పెద్ద ఎత్తున ఎన్నికల్లో గెలిచినట్లుగా క్లెయిం చేసుకుంటున్నారు. ఇలాంటివేళ.. ఏ పార్టీకి ఎన్ని స్థానాల్ని సొంతం చేసుకున్నాయన్న విషయంపై ఏకాభిప్రాయం వ్యక్తం కాని పరిస్థితి.
ఏపీలో జరుగుతున్న మూడో దశ పంచాయితీ ఎన్నికలు మొత్తం 3221 స్థానాలకు జరగాల్సి ఉన్నా.. అందులో 579 స్థానాల్లో ఏకగ్రీవాలు అయ్యాయి. మిగిలిన 2442 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఫలితాలకు సంబంధించి అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చెప్పే అంకెలు ఒకలా ఉంటే.. టీడీపీ విడుదల చేసిన జాబితా మరోలా ఉంది. అయితే.. టీడీపీ తరఫున గెలుపొందిన అభ్యర్థుల పేర్లకు బదులుగా పంచాయితీ పేర్లను ప్రకటించటం గమనార్హం.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన జాబితా ప్రకారం తాము 2482 చోట్ల విజయం సాధించినట్లుగా పేర్కొంది. టీడీపీకి 501 చోట్ల గెలిచిందని.. ఇతరులు 145 చోట్ల గెలిచారని పేర్కొన్నారు. టీడీపీ విడుదల చేసిన జాబితా ప్రకారం తాము 1069 చోట్ల గెలిస్తే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు 1393 చోట్ల గెలిచారని.. జనసేన 8 చోట్ల.. ఇతరులు 70 చోట్ల గెలిచినట్లుగా చెబుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ తో పోలిస్తే.. టీడీపీ విడుదల చేసిన జాబితాలో ఇతరుల సంఖ్య తక్కువగా ఉండటం గమనార్హం.