ఏపీలో తొలిదశ నామినేషన్లు ప్రారంభం!

Update: 2021-01-29 08:23 GMT
ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల నామినేషన్​ ప్రక్రియ ప్రారంభమైంది. ఎన్నో ఉత్కంఠల మధ్య ఎన్నికల ప్రక్రియ మొదలైన విషయం తెలిసిందే. వ్యాక్సినేషన్​ ప్రక్రియ కొనసాగుతున్నందున ఎన్నికలు ఇప్పుడు నిర్వహించడం వీలు కాదని ప్రభుత్వం.. ఎన్నికలు పెట్టి తీరాల్సిందేనని ఎన్నికల సంఘం పట్టుబట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రెండు రాజ్యాంగసంస్థలు సుప్రీంకోర్టు దాకా వెళ్లాయి.

అయితే ఎన్నికల నిర్వహణకు సుప్రీంకోర్టు కూడా ఒకే చెప్పడంతో చివరకు ప్రభుత్వం దిగివచ్చింది. ఎన్నికల సంఘం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని అధికార పార్టీ నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియ మొదలైంది.  నేటి నుంచి తొలివిడత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్నది. ఈ నెల 31తో నామినేషన్ల గడవు పూర్తి కానున్నది. మొదటి దశ కింద ఫిబ్రవరి 9న విజయనగరం మినహా 12 జిల్లాల్లోని 3,345 గ్రామా పంచాయతీలకు, వాటిలోని 33,794 వార్డులకు ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 వరకు పోలింగ్​ నిర్వహించనున్నారు. అదేరోజు ఫలితాలు కూడా వెల్లడించనున్నారు.  

ప్రస్తుతం ఏపీలో పొలిటికల్​ హీట్​ మొదలైంది. ఎన్నికల సంఘం.. ఇటు ప్రభుత్వానికి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్నది. ఎన్నికలసంఘం దూకుడుగా వెళ్తున్నది. ఇప్పటికే పలువురు అధికారులను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. మరోవైపు వాళ్లకు ఏపీ ప్రభుత్వం మరింత ఉన్నత స్థాయి పోస్టింగ్​లు ఇస్తున్నది. ఈ నేపథ్యంలో ఇరువ్యవస్థల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్నది.
Tags:    

Similar News