ఏపీలో కరోనా కేసుల జోరు తగ్గడం లేదు. వైరస్ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ప్రతీరోజు 10వేలకు కేసులు తగ్గడం లేదు. శుక్రవారం కూడా అదే జోరు కొనసాగింది.
తాజాగా గడిచిన 24 గంటల్లో ఏపీలో 9999 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 71137 టెస్టులు చేయగా 10వేల కేసులు వెలుగుచూశాయి. దీంతో ఏపీలో కరోనా కేసులు 5 లక్షలు దాటేశాయి. తాజాగా కేసులతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 5,47,686 కు పెరిగాయి.
ఏపీలో కరోనా తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు. కాగా ఏపీలో ప్రజాప్రతినిధులు వరుసగా కరోనా వైరస్ బారినపడుతున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలకు కరోనా సోకగా.. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజుకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఆయన తల్లి, ఇద్దరు కుమారులకు కూడా పాజిటివ్ వచ్చింది.
దీంతో వైద్యుల సలహా మేరకు ఎమ్మెల్యే కుటుంబం మొత్తం హోం ఐసోలేషన్ లో ఉన్నారు. ఈ సందర్భంగా తనను కలిసిన వారంతా టెస్టులు చేయించుకోవాలని ఎమ్మెల్యే బాలరాజు సూచించారు.