బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టోను చూస్తుంటే అలాగే అనుమానిస్తున్నారు. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. నాలుగు రాష్ట్రాలను వదిలిపెట్టి కేవలం పాండిచ్చేరి రాష్ట్రంలో జరిగే ఎన్నికల మీద మాత్రమే బీజేపీ+కేంద్రప్రభుత్వం దృష్టిపెట్టింది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న టార్గెట్ తో పుదుచ్చేరిలో బీజేపీ గెలిస్తే రాష్ట్రాభివృద్ధికి ప్రత్యేకహొదా ఇస్తామని మ్యానిఫెస్టోలో పెట్టడంతో అందరు ఆశ్చర్యపోతున్నారు.
ఏపికి ప్రత్యేకహోదా అడుగుతుంటేనేమో హోదా అనేది ముగిసిన అధ్యాయమని కేంద్రప్రభుత్వం, కమలనాదులు నెట్టుకొస్తున్నారు. విభజన చట్టాన్ని చూపించిన వాళ్ళకు ఏపికి హోదా ఇచ్చేది లేదని ఈమధ్యనే కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది కేంద్రం. ఏ రాష్ట్రానికి కూడా ప్రత్యేకహోదా అవసరం లేదని నీతిఅయోగ్ చెప్పిందని, 14వ ఆర్ధికసంఘం సిఫారసు చేసిందని సొల్లు చెబుతున్నారు కేంద్రమంత్రులు.
మరి అదే నిజమైతే ఇపుడు పాండిచ్చేరికి మాత్రం స్పెషల్ స్టేటస్ ఎలా ఇస్తామని కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ హామీ ఇచ్చారు ? అయినా ఒక్క పాండిచ్చేరికి మాత్రమే ఎందుకు ప్రత్యేకహోదా ఇచ్చారు ? ఎందుకంటే ఇక్కడ మాత్రమే గెలిచే అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టే. ఎన్నికలు జరుగుతున్న కేరళ, తమిళనాడులో అవకాశాలు లేవు.
అతిపెద్ద రాష్ట్రమైన పశ్చిమబెంగాల్ పరిస్ధితి ఎవరు చెప్పలేకున్నారు. ఇక అస్సాంలో కూడా పరిస్ధితి జటిలమైపోయింది. పైగా ధక్షిణాదిలో కాలు పెట్టాలని బీజేపీ ఎప్పటినుండో ప్రయత్నం చేస్తోంది. ఒక్క కర్నాటకలో మాత్రమే అధికారంలోకి వస్తు పోతోంది. ఇది తప్ప రెండో రాష్ట్రమే బీజేపీ చేతిలో లేదు. అందుకనే 34 నియోజకవర్గాలున్న చిన్న రాష్ట్రమైన పాండిచ్చేరి మీద ఎక్కువ దృష్టి పెట్టింది. మరి ఇక్కడ గెలిచిన తర్వాత హోదా ఇస్తుందా లేకపోతే ఏపిని మోసం చేసినట్లే చేస్తుందో చూడాల్సిందే.