కాదేదీ రాజకీయల కు అనర్హం.. అన్నట్టు మారిపోయింది దేశంలో పరిస్థితి. తమ కు ఏమాత్రం అవకాశం ఉన్నా.. దానిని వినియోగించుకుని రాజకీయాలు చేసేందుకు నాయకులు సిద్ధమవుతున్నాయి. ఇప్పుడు దేశ పార్లమెంటు కొత్త భవనం కూడా.. అదే రేంజ్‌లో రాజకీయాల కు కేంద్రంగా మారింది. సుమారు 200 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న ఈ పార్లమెంటు భవనం తొలి దశ పనులు పూర్తయ్యాయి. మలి దశ పనులు ఇంకా చేయాల్సిఉంది. అయితే.. ఈ నెల 28న ఆదివారం దీనిని ప్రారంభించేందుకు ముహూర్తం రెడీ చేశారు.
కానీ, ఇదే ఇప్పుడు దేశంలో చర్చకు , రాజకీయ రగడ కు దారితీసింది. పార్లమెంటు భవనం ప్రారంభోత్స వాన్ని రాజకీయాల కు అతీతంగా నిర్వహిస్తే బాగానే ఉంది. కానీ, దీనికి ఇప్పుడు రాజకీయ రంగు పులుము కుంది. ఎందుకంటే.. రాజ్యాంగంలో కీలక అంగమైన.. పార్లమెంటు ను.. రాజ్యాంగ పరిరక్షణ కర్తగా ఉన్న రాష్ట్రపతి(ద్రౌపది ముర్ము) చేతుల మీదుగా కాకుండా.. ప్రధానమంత్రి మోడీ ప్రారంభించేందు కు రెడీ కావడమే.
నూతన పార్లమెంటు ను రెండేళ్ల కిందట శంకుస్థాపన చేసినప్పుడు.. ఇప్పుడు ప్రారంభోత్సవానికికూడా రాష్ట్ర పతికి ఎలాంటి ఆహ్వానం పంపలేదు. వాస్తవానికి రాజ్యాంగ వ్యవస్థల కు సంబంధించిన భవనాల ను రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రారంభించడం ఆనవాయితీ.
ఒకసారి వాయిదా పడిన సభల ను తిరిగి ప్రారంభించేందుకు రాష్ట్రపతి ప్రసంగం అవసరమని రాజ్యాంగం చెబుతోంది. మరి అలాంటి ప్రాధాన్యం ఉన్న రాష్ట్రపతి కి కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవానికి అసలు ఆహ్వానమే అందక పోవడం విస్మయానికి గురిచేస్తోంది.
దీంతో ఈ విషయాన్ని కాంగ్రెస్, ప్రతిపక్షాలు రాజకీయంగా మార్చాయి. రాష్ట్రపతికి ఆహ్వానం లేకపోవడం మోడీ సర్కార్ అవమానించడమేనని ధ్వజమెత్తుతున్నాయి. ఇంత భారీ కార్యక్రమానికి రాష్ట్రపతిని ఆహ్వానించకపోవడం పై దేశవ్యాప్తంగా కూడా విమర్శలు వస్తున్నాయి.
రాష్ట్రపతి కార్యాలయ ఔచిత్యాన్ని పదేపదే మోడీ ప్రభుత్వం అవమానిస్తోందని మేధావులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు. అయితే.. మోడీ వ్యూహం పక్కాగా స్పష్టమవుతోందని.. కొందరు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల నాటికి పార్లమెంటు భవనాన్ని రాజకీయ తురుపు ముక్కుగా చూపించుకోవాలని ఆయన భావిస్తున్నారు. ఓట్ల వేటలో దీనిని ఆయుధంగా మార్చుకుని దూసుకునే ప్రయత్నం చేస్తారని అంచనా వేస్తున్నారు.