అవును! ఇది నమ్మడానికి ఆశ్చర్యంగా అనిపించినా నిజం! దేశానికి యోగా పాఠాలు నేర్పే.. బాబా రాందేవ్ ఇప్పుడు బిలియనీర్ అయిపోయారు. ఆయనతో పాటు అడుగులు కలిపిన బాలకృష్ణ ఇప్పుడు దేశంలోని ధనవంతుల జాబితాలో 8వ స్థానం కైవసం చేసుకున్నారు. యోగా గురువుగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన రాందేవ్.. తర్వాత వాణిజ్యం వైపు తన దృష్టి పెట్టారు. ప్రజల ఆరోగ్య అవసరాలను దృష్టిలో పెట్టుకుని పతంజలి పేరుతో సంస్థను స్థాపించి పూర్తి ఆయుర్వేద గుణాలున్న ఔషధాలతో అతి చౌక ధరలకే తన వ్యాపారం ప్రారంభించారు. ఇంతింతై.. అన్నట్టుగా ఈ వ్యాపారం.. పుంజుకుని నేడు నిత్యావసర సరుకుల వరకు విస్తరించారు.
దీంతో వ్యాపారం వందల కోట్ల రూపాయలకు చేరింది. ఈ వ్యాపార యజ్ఞంలో ఆచార్య బాలకృష్ణ.. రాందేవ్‌కి సహకరించారు. ఇరువురూ ఈ వ్యాపారాన్ని ఆకాశమే హద్దుగా విస్తరించారు. రాందేవ్ బాబా నడుపుతున్న ఎఫ్ ఎంసీజీ కంపెనీ పతంజలికి బాలకృష్ణ సీఈవోగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఈయనే దేశంలోని అత్యంత ధనికుల్లో 8వ స్థానంలో నిలిచారు. హ్యూరున్ ఇండియా రిచ్ లిస్ట్-2017 జాబితాలో ఈయన పేరు 8వ స్థానంలో చేరింది. గత ఏడాది ఇదే జాబితాలో ఆయన 25వ స్థానంలో ఉండడం గమనార్హం.
ఇక, ప్రస్తుతం అంచనా ప్రకారం ఈయన వ్యాపార సంపద 173 శాతానికి పెరిగిందని సర్వే సంస్థ వివరించింది. అతి తక్కువ సమయంలో తొలి పదిమంది జాబితాలో చోటు సంపాయించడం అంత తేలికైన విషయం కాదని, అయితే, అది ఒక్క బాలకృష్ణ వల్లే సాధ్యమైందని వివరించింది. రాందేవ్ కు బాల్య స్నేహితుడైన బాలకృష్ణ దీనిలో 94% వాటా కలిగి ఉన్నారు. 2006లో ప్రారంభమైన పతంజలి ఉత్పత్తులు నేడు దేశ వ్యాప్తంగా విస్తరించాయి. ఏటా 10,561 కోట్ల టర్నోవర్ జరుగుతుండడం విశేషం. గతంలో సీబీఐ చీటింగ్ కేసు నమోదు చేసినా.. ఈ కేసు నుంచి స్వచ్ఛంగా బయటపడడం విశేషం.