ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా కరెంట్ కట్ కటలే కనిపిస్తున్నాయి. ఏకంగా పరిశ్రమలకు పవర్ హాలీడేలు ఇచ్చిన పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభానికి వైసీపీ నేతల అనాలోచిత విధానాలే కారణమని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్లెల్లో 11 నుంచి 14 గంటలు.. పట్టణాల్లో 5 నుంచి 8 గంటలు.. నగరాల్లో 4 నుంచి 6 గంటలు చొప్పున అనధికార విద్యుత్ కోతలు విధించడంతో జనం అల్లాడిపోతున్నారని మండిపడ్డారు.
మొబైల్ ఫోన్ లైట్ల వెలుతురులో ఆస్పత్రుల్లో ఆపరేషన్లు, ప్రసవాలు జరగడం చూస్తుంటే రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోందని పవన్ కళ్యాణ్ ఆవేదన చెందారు. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఉండేది. ఫలితంగా 2014-19 సమయంలో విద్యుత్ కోతల ప్రభావం అంతగా లేదని పవన్ అన్నారు.
వైసీపీ అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వం చేసుకున్న విద్యుత్ కొనుగోలు అగ్రిమెంట్లు (పీపీఏ) రద్దు చేసిందని చెప్పారు. యూనిట్ రూ.4.80 చొప్పున 25 ఏళ్ల పాటు గ్రీన్ ఎనర్జీ కంపెనీలతో అప్పటి ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసిందని మండిపడ్డారు. రెండు రూపాయలకే గ్రీన్ ఎనర్జీని తీసుకొస్తామని చెప్పి ప్రస్తుతం కోల్ ఎనర్జీని రూ.20 పెట్టి కొనుగోలు చేస్తున్నారని విమర్శించారు.
ఉచితం అని చెప్పి 57శాతం చార్జీలు పెంచారు. అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు తగ్గిస్తామన్నారు. అల్పాదాయ వర్గాలకు 200 యూనిట్ల వరకూ ఉచితంగా విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చిన వైసీపీ ప్రభుత్వం ఇవాళ 57 శాతం చార్జీలు పెంచింది. ఫ్యాన్, రెండు లైట్లు, 15 గంటలు టీవీ చూసినా 150 యూనిట్లే ఖర్చు అవుతుందని .. మరో 50 యూనిట్లు పెద్ద మనసుతో అదనంగా ఇస్తున్నామని చెప్పారు. ఇప్పుడు విద్యుత్ చార్జీలు పెంచి ఇళ్లల్లో ఫ్యాన్లు వేసుకోకుండా చేశారని పవన్ తీవ్ర విమర్శలు చేశారు.
విద్యార్థులు పరీక్షలకు సిద్ధమవుతున్న వేళ ఏపీలో వేళాపాళా లేని విద్యుత్ కోతలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పవన్ విమర్శించారు. ఇళ్లల్లో కరెంట్ లేకపోవడంతో కొందరు రైల్వే స్టేషన్, బస్టాండుల్లో పడుకుంటున్నారని పవన్ ఆరోపించారు. వారానికి రెండు రోజులు పరిశ్రమలకు పవర్ హాలీడే ప్రకటిస్తే ఇక అవి మూతపడుతాయని పవన్ ఆవేదన చెందారు.