జగన్ హస్తిన యాత్ర కు వెళ్లిన సమయంలో మొదలైన "ముందస్తు" టాపిక్స్ ఏపీలో ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ముందస్తు ఎన్నికల కు వెళ్లాలనే ఆలోచన తనకు లేదని, ఎన్నికలకు ఇంకా 9 నెలల సమయం ఉందని, షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు ఉంటాయని తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టం చేసినా కూడా ఈ ముందస్తు ఎన్నికల పై ఊహాగాణాల కు తెరపడటం లేదు. ఈ క్రమంలో తాజాగా పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
అవును... ఏపీ లో ముందస్తు ఎన్నికలు ఉండొచ్చని పవన్ అభిప్రాయపడ్డారు. ఇంకో ఆరు నెలల్లో ఏపీ అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని జోస్యం చెప్పారు. డిసెంబర్ లో తెలంగాణ తో పాటు ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగొచ్చని పవన్ వ్యాఖ్యానించారు. ఎన్నికల ను ఎదుర్కొనడానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీ క్యాడర్ సంసిద్ధంగా ఉండాలని సూచించారు. దీంతో... రాష్ట్ర రాజకీయాల్లో ముందస్తు ఎన్నికల అంశం మరోసారి తెరమీదికి వచ్చింది.
తాజాగా గుంటూరు జిల్లా మంగళగిరి లోని పార్టీ కేంద్ర కార్యాలయానికి భూమిపూజ చేసిన అనంతరం పవన్ కల్యాణ్.. పార్టీ తెలంగాణ రాష్ట్రశాఖ నాయకు లతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ఎన్నికల్లో కూడా జనసేన పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా జంటనగరాల్లో సుమారు ఏడు నియోజకవర్గాలతో పాటు, మిగిలిన రాష్ట్రమంతా కలిపి మొత్తం 26 సెగ్మెంట్లకు జనసేన ఇన్చార్జిల జాబితా విడుదల చేశారు.
ఈ సందర్భంగా తెలంగాణ జనసేన నాయకుల తో సమావేశం అయిన పవన్... డిసెంబర్ లో తెలంగాణ అసెంబ్లీతో పాటు ఏపీ లోనూ ఎన్నికలు జరుగుతాయని, రెండూ తెలుగు రాష్ట్రాలు ఉమ్మడిగా కలిసి ఎన్నికల కు వెళ్తాయని అన్నారు. ఈ సందర్భంగా పొత్తుల పై కూడా పవన్ స్పష్ట ఇచ్చే ప్రయత్నం చేశారు!
సీట్ల పంపకాల తో పాటు అన్ని అంశాలూ కుదిరితేనే రెండు రాష్ట్రాల్లోనూ పొత్తుల గురించి ఆలోచిస్తామని స్పష్టం చేశారు. ఏపీ లో టీడీపీ తో అయినా సరే అన్నీ కుదిరితేనే పొత్తుల కు వెళ్తామని.. లేదంటే ఒంటరి పోరు తప్పదని పవన్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇదే క్రమంలో... ఒంటరి గానే ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితే వస్తే... అందుకు అనుసరించాల్సిన వ్యూహాల ను త్వరలో చెబుతామని పవన్ తెలిపారు.
కాగా, ఈ ఏడాది అయిదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది చివరి నాటికి తెలంగాణ సహా ఛత్తీస్ గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరాం లలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడానికి ఈసీ కసరత్తు మొదలు పెట్టనుంది.