ఐదుపాయింట్ల ఎజెండా పెట్టుకొని వరుస ట్వీట్లతో భారతీయ జనతాపార్టీ సారథ్యంలో కేంద్రంలోని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ దఫా ఏకంగా చాలెంజ్ చేశారు. గోవధ - రోహిత్ వేముల మృతి - దేశభక్తిపై బీజేపీపై టార్గెట్ చేస్తూ ట్వీట్ చేసిన పవన్ దానికి కొనసాగింపుగా తాజాగా ప్రత్యేక హోదాపై ట్వీట్లతో స్పందించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామంటూ ప్రకటించిన బీజేపీ ఆ విషయాన్ని పూర్తిగా విస్మరించిందని మండిపడ్డారు. స్పెషల్ ప్యాకేజీ పేరుతో కేంద్రం ప్రకటించిన దాంట్లో కేవలం స్పెషల్ అనే పదం తప్ప కొత్తగా ఏం లేదని పవన్ ఎద్దేవా చేశారు. దీని వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదన్నారు.
గతంలో జరిగిన జై ఆంధ్ర ఉద్యమంలో 400 మందికిపైగా యువకులు ప్రాణత్యాగం చేయడాన్ని గుర్తు చేసిన పవన్ కళ్యాణ్ ఆ పోరాటాన్ని ఎవరూ మర్చిపోలేరన్నారు. ఆనాడు బలిదానం చేసుకున్న 400 మంది ప్రాణాలపై ప్రమాణం చేసి చెబుతున్నా.. ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు బీజేపీపై పోరాటం చేస్తామని పవన్ కల్యాణ్ తేల్చిచెప్పారు. ఆంధ్రప్రదేశ్ విషంయలో బీజేపీ తీరు అవమానకరంగా ఉందని పవన్ ట్వీట్ చేశారు. ఆంధ్రులు అంటే వెన్నెముకలేని, ఆత్మాభిమానం లేనివారిగా కేంద్రం భావిస్తోందని వ్యాఖ్యానించారు. దశాబ్దంపాటు ఎన్నో అవమానాలను భరించిన ఆంధ్రులను ఆఖరికి రాజధాని లేకుండా గెంటేశారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే బీజేపీపై స్పందించాల్సి వస్తోందని ట్వీట్ చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/