అమ‌రావ‌తిలో ప‌వ‌న్ ఇంటి బ‌డ్జెట్ అంతా?

Update: 2018-03-12 09:59 GMT
విష‌యం ఏదైనా స‌రే.. ఉన్న‌ది ఉన్న‌ట్లుగా చెప్ప‌టం జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కు అల‌వాటుగా చెబుతుంటారు. రాజ‌కీయాలు మొద‌లుకొని త‌న ఆర్థిక ప‌రిస్థితి గురించి.. ఏ విష‌యాన్నైనా.. తాను న‌మ్మినోళ్ల ద‌గ్గ‌ర ఓపెన్ గా చ‌ర్చిస్తుంటార‌ని చెబుతుంటారు. త‌ర‌చూ త‌న ఆర్థిక ప‌రిస్థితి గురించి ప్ర‌స్తావిస్తూ.. తాను ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న‌ట్లు చెబుతారు.

అలా అని ప‌వ‌న్ కు అప్పులు ఉన్నాయ‌ని కాదు కానీ.. ఆస్తులు పెద్ద‌గా లేవ‌ని చెబుతారు. ఉన్న కొద్దిపాటి ఆస్తి లెక్క‌ను ఆయ‌న త‌న స‌న్నిహితుల ద‌గ్గ‌ర ఓపెన్ గా డిస్క‌స్ చేస్తుంటార‌ని చెబుతారు. లిక్విడ్ క్యాష్ అంతంతే ఉంద‌ని చెప్పే ప‌వ‌న్‌.. తాజాగా త‌న  కొత్త ఇంటిని భారీ ఖ‌ర్చుతో నిర్మిస్తున్న‌ట్లు చెబుతున్నారు.

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తికి ద‌గ్గ‌ర్లోని రెండు ఎక‌రాల భూమిలో ప‌వ‌న్ త‌న ఇంటిని నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ రోజు ఉదయం త‌న భార్య‌.. పిల్ల‌ల‌తో క‌లిసి భూమిపూజ చేసిన ఆయ‌న‌.. త్వ‌ర‌లోనే ఇంటి నిర్మాణం పూర్తి చేస్తార‌ని చెబుతున్నారు. అమ‌రావ‌తికి ద‌గ్గ‌ర్లో రెండు ఎక‌రాలంటే త‌క్కువ‌లో త‌క్కువ రూ.25 కోట్ల‌కు పైనే ఉంద‌ని చెబుతున్నారు. ఇక‌.. 2 ఎక‌రాల్లో ఇల్లు.. అది ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇల్లు అన్న‌ప్ప‌డు ఎంతోకొంత విశాలంగా.. విలాసంగా ఉంటుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మవుతుంది.

కొత్త ఇంటికి క‌నీసం రూ.40 కోట్ల మేర ఖ‌ర్చు అయ్యే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. మొత్తంగా కొత్తిల్లు బ‌డ్జెట్ ద‌గ్గ‌ర ద‌గ్గ‌ర రూ.70 కోట్ల వ‌ర‌కూ ఉంటుంద‌ని తెలుస్తోంది. ఓప‌క్క త‌న ద‌గ్గ‌ర ప‌ని చేస్తున్న సిబ్బందికి జీతాలు ఇచ్చే విష‌యంలో తాను ఇబ్బందులు ఎదుర్కొంటున్న‌ట్లు.. ఆర్థిక ఇబ్బందుల‌తో కారు అమ్మేసిన‌ట్లుగా వార్త‌లు వ‌చ్చే వేళ‌లో.. అంద‌కు భిన్నంగా ఇంత భారీగా కొత్తింటి నిర్మాణం.. అందుకోసం హెవీ బ‌డ్జెట్ ఖ‌ర్చు చేస్తున్న వైనం అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. 
Tags:    

Similar News