ఇన్నాళ్ల‌కు కానీ.. ప‌వ‌న్‌కు తెలిసిరాలేదా..!

Update: 2023-03-13 17:00 GMT
రాజ‌కీయం రాజ‌కీయ‌మే! ఎవ‌రు ఉన్నా..ఎవ‌రు ఏం చేసినా.. ఎంత నీతులు చెప్పినా.. రాజ‌కీయాల‌ను మా ర్చ‌డం.. కుద‌ర‌దు. కుదిరితే..ఏమార్చ‌వ‌చ్చేమో!! ఇప్పుడు ఏపీ విష‌యానికి వ‌స్తే.. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యం లో ప్ర‌జ‌ల‌కు ఎంతో నీతివంతమైన వాక్యాలు బోధించారు జ‌నసేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. ఎన్నిక‌లు ఎవ‌రు డ‌బ్బులు ఇచ్చినా తీసుకోవ‌ద్ద‌ని చెప్పారు. డ‌బ్బులకు అమ్ముడు పోయి.. మీ జీవితాలే కాదు.. రాష్ట్ర భవిష్య‌త్తును కూడా నాశ‌నం చేసుకుంటారా? అని నిప్పులు చెరిగారు.

ఇక‌, ఇటీవ‌ల కూడా.. కేవ‌లం అర్ధ‌రూపాయికి ఆశ‌ప‌డి.. అమూల్య‌మైన ఓటు ను అమ్మేసుకుని.. ఏం సాధి స్తార‌ని.. కూడా ప్ర‌శ్నించారు.కానీ.. ప‌వ‌న్ ఎన్ని ప్ర‌శ్న‌లు వేసినా..ఎన్నిక‌ల్లో ఎవ‌రూ.. వ్యూహాల‌ను మార్చ‌లే రు. ఎవ‌రి అవ‌స‌రం వారిది! ఎవ‌రి ప‌రిస్థితి వారిది. సో.. ఈ క్ర‌మంలో ఎవ‌రూ ఎవ‌రికీ త‌క్కువ‌కాదు. దీంతో నాయ‌కులు ఓట్ల కోసం వెంప‌ర్లాడితే.. ఇప్పుడే క‌దా.. నాయ‌కులు త‌మ‌కు ఇచ్చేద‌ని ప్ర‌జ‌లు కొంద‌రు భావిస్తున్నారు.

దీంతో ఓటుకు నోటు ఇప్పుడు సంప్ర‌దాయంగా మారిపోయింది. అంతేకాదు.. ఎంతో విలువ‌లు వున్న‌వారు సైతం.. ఎన్నిక‌ల్లో పోటీ చేసినా..రూపాయితో కానీ ప‌నులు జ‌ర‌గ‌డం లేదు. సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మీనారాయణ ప‌ట్ల ప్ర‌జ‌లు జేజేలు కొట్టారు.

సూరుడు.. వీరుడు.. హీరో అంటూ ప్ర‌శంస‌లు గుప్పించారు. కానీ, చివ‌ర‌కు ఆయ‌నే పోటీ చేసినా.. డిపాజిట్ ద‌క్కించుకోలేక పోయారు. రేపు చంద్ర‌బాబు, జ‌గ‌న్‌ల‌కే  ఈ ప‌రిస్థి తి వ‌చ్చినా ఆశ్చ‌ర్యం లేనంత‌గా ఇప్పుడు ఏపీలో ఎన్నిక‌ల ప‌రిస్థితి మారిపోయింది.

స‌రే.. ఈ విష‌యాలు ఇలా.. ఉంటే.. ఇన్నాళ్ల‌కు కానీ.. ప‌వ‌న్ వాటిని గుర్తించిన‌ట్టుగా లేరు. తాజాగా ఆయ‌న త‌న టంగ్‌ను మార్చుకున్నారు. కాపుల‌తో తాజాగా భేటీ అయిన ప‌వ‌న్‌.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏ పార్టీ డ‌బ్బులు ఇచ్చినా తీసుకోమ‌ని చెప్పారు.

ఇది ఆశ్చ‌ర్యంగా అనిపించినా.. నిజం. అంతేకాదు.. డ‌బ్బులు తీసుకున్నాక‌.. ఓటు మాత్రం త‌న పార్టీ గుర్తు గాజు గ్లాస్‌కు వేయాల‌ని ఆయ‌న చెప్ప‌డం మ‌రింత సంచ‌ల‌నంగా మారింది. ప్ర‌స్తుతం ఈ కామెంట్లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.     


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News