పవన్ కళ్యాణ్ మొదటి నుంచి కూడా ఒక వైపే చూస్తూ వస్తున్నారు. ఆయన ఎంతసేపూ జగన్ని పట్టుకుని విమర్శలు చేస్తారు. వైసీపీ ప్రభుత్వమే అవినీతిమయం అంటారు. వైసీపీతోనే అంతా సర్వనాశనం అయింది అన్నట్లుగా మాట్లాడుతారు. అదే టైం లో 2014 నుంచి 2019 దాకా అధికారంలో ఉంటూ తప్పులు చేసిన టీడీపీని ఎందుకు విమర్శించరు అని వైసీపీ నేతల నుంచి వస్తున్న ప్రశ్నలు.
తప్పు ఎవరి చేసినా కాలర్ పట్టుకుంటాను అని పవన్ తాజాగా ఇస్తున్న స్టేట్మెంట్స్ మీద వైసీపీ మాజీ మంత్రులు సీనియర్ నేతల నుంచి వస్తున్న కౌంటర్ ఇదే. అలా అయితే గతంలో అధికారం చలాయించిన చంద్రబాబును ఎన్ని సార్లు కాలర్ పట్టుకున్నావ్ పవన్ అని అడుగుతున్నారు. అదే విధంగా ఏపీ విషయంలో దారుణంగా వంచించి విభజన హామీలతో పాటు ప్రత్యేక హోదాను తుంగలోకి తొక్కిన బీజేపీని నరేంద్ర మోడీని ఎందుకు విమర్శించరు అని అడుగుతున్నారు.
పవన్ వారాహి రధయాత్ర రొటీన్ గా రొడ్డకొట్టుడు స్పీచులతో ఉండడానికి కారణం ఆయన ఒక వైపే చూడడం అని అంటున్నారు. నిజానికి ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ మీదనే ఎక్కువగా విమర్శించాలి. కానీ అదే టైం లో ఏపీలో అప్పులు వారసత్వంగా వచ్చాయి. చంద్రబాబు అప్పులు చేశారు. పోలవరం బాబు హయాంలోనూ పూర్తి చేయలేకపోయారు. ప్రత్యేక హోదా, విభజన హామీల విషయంలో టీడీపీ కూడా కేంద్రాన్ని ప్రశ్నించలేకపోయింది.
ఇక అనేక హామీలను కూడా టీడీపీ ఇచ్చి అమలు చేయలేకపోయింది. ఈ రోజుకు ఏపీ ఈ విధంగా ఉండడానికి టీడీపీ వైసీపీ రెండు పార్టీలు కారణం అన్నది కచ్చితనమైన విశ్లేషణ. మరి పవన్ అయితే టీడీపీ ఊసు ఎత్తడం లేదు. పల్లెత్తు మాట చంద్రబాబుని అనడంలేదు. అప్పటికి ఆ ఆయిదేళ్ళూ ఏపీ బంగారంగా ఉన్నట్లు కేవలం జగన్ ఏలుబడిలోనే నాశనం అయినట్లుగా పవన్ చేస్తున్న విమర్శలలో వాస్తవాలు జనాలకు తెలియవు అనుకుంటే ఎలా అంటున్నారు.
సరే చంద్రబాబుని పవన్ విమర్శించనవసరం లేదు అనుకోవచ్చు. ఆయనతో పొత్తులకు వెళ్తారు అని కూడా అనుకోవచ్చు. అలాంటపుడు నేనే ఆల్టర్నేషన్ అని పవన్ ఎలా చెబుతారు, జనాలు ఎలా నమ్ముతారు. ఏపీలో వైసీపీని గద్దె దించాలనుకుంటే ఈ రోజుకీ ఆ సామర్ధ్యం టీడీపీకే ఎక్కువగా ఉంది అని అంటున్నారు. మరి విపక్షంలో పోటీలో తనతో రేసులో ఉన్న టీడీపీని కూడా దాటుకుని వెళ్తేనే కదా ఏపీలో పవన్ సీఎం అయ్యేది అన్న చర్చ ఉంది.
కానీ పవన్ మాత్రం జగన్ తప్పులనే వెతుకున్నారు తప్ప చంద్రబాబుని ఏ కోశానా విమర్శించకపోవడం ఆయన వారాహి యాత్రలో డొల్లతనంగా చెబుతున్నారు. దాన్ని బట్టి ఒక వ్యూహం ప్రకారమే పవన్ వైసీపీ మీద విమర్శలు చేస్తున్నారని అంటున్నరు. టీడీపీని విమర్శించకుండా పొత్తుల ఆప్షన్ ని అలా ఉంచుకున్నారని అంటున్నారు. అలాగే బీజేపీని కూడా ఏమీ అనకుండా తన యాత్రను కొనసాగిస్తున్నారు.
ఏపీకి బీజేపీ తీరని అన్యాయం చేసినా పవన్ కంటికి కనిపించలేదా అని ప్రశ్నిస్తున్నారు. రాజకీయాల్లో ఉన్నపుడు తానే జనాలకు ఆల్టర్నేషన్ కావాలని అనుకున్నపుడు కచ్చితంగా వైసీపీతో పాటు టీడీపీ బీజేపీలను కూడా పవన్ విమర్శిస్తేనే అందులో నిజాయతీని జనాలు చూస్తారని అంటున్నారు. గోదావరి జిల్లాల టూర్ లో పోలవరం ప్రాజెక్ట్ గురించి పవన్ మాట్లాడితే బాగుంటుంది అని అంటున్నారు.
అపుడు తప్పులు కేంద్రంలోని బీజేపీ చేసిందా లేదా అన్నది కూడా ఆయన జనంలోనే చర్చకు పెడితే బాగుంటుంది అంటున్నారు. ఏపీలో వైసీపీ ఉద్యోగాలు ఇవ్వలేదని విమర్శిస్తున్న పవన్ బంగారం లాంటి స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేసి ఉన్న ఉద్యోగాలకు గ్యారంటీ లేకుండా చేస్తున్న చర్యలు కనిపించడంలేదా అని కూడా అడుగుతున్నరు.
పవన్ ప్రసంగాలలో క్లారిటీ లోపిస్తోంది, అలాగే నిర్ధిష్ట రాజకీయ అజెండా లేకుండా ఉందని విమర్శలు అయితే ఉన్నాయి. రాజకీయంగా బలపడాలి అంటే వారు వీరూ తేడా లేకుండా అందరినీ విమర్శించాలి. ఎందుకంటే ఏపీలో వైసీపీ టీడీపీ బీజేపీ పార్టీలు అధికారం అనుభవించాయి. తప్పులలో వారికి పాత్ర ఉంది.
పవన్ అధికారంలో ఇప్పటిదాకా లేరు కాబట్టి ఆయన ఏ పార్టీని పక్కన పెట్టకుండా విమర్శించవచ్చు. అపుడే జనాలు నమ్ముతారు అని అంటున్నారు. అలా కాకుండా ఎక్కడ సభ పెట్టినా కేవలం వైసీపీ మీదనే విమర్శలు చేస్తూ పోతూంటే అది సిద్ధాంతపరమైన రాజకీయం అనుకోరు. వ్యక్తిగత కక్షలతో కూడిన రాజకీయం అని లైట్ తీసుకునే ప్రమాదం ఉందని అంటున్నారు.