నెల్లూరు నేత‌ల‌కు పవన్ గేలం...

Update: 2018-08-07 14:58 GMT
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన పార్టీని బలోపేతం చేయాడానికి అడుగులు వేస్తున్నారు. వచ్చే ఎన్నికలలో అభ్యర్ధులను ఎంపిక చేసుకోవడానికి జనసేన పార్టీ కసరత్తు మొదలు పెట్టింది. అధికార పార్టీ అయిన తెలుగుదేశం అభ్యర్దులపై జనసేన కన్నేసింది. ఈ సారి ఎన్నికలలో పోటికి జనసేన సిద్దపడుతోందా..? అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పవన్ కల్యాణ్ కు ఆంధ్రప్రదేశ్‌ లో అతి ప్రాధాన్యమైన నగరం నెల్లారు. ఆయన అక్కడే రెండేళ్ల చదువుకున్నారు. ఆ జిల్లాలో మెగా ఫ్యాన్స్ కూడా ఎక్కువగానే ఉన్నారు. అంతే కాకుండా జనసేన పార్టీ కన్వీనర్ గంగాధర్ కూడా నెల్లురు జిల్లాకు చెందినవాడే - దీంతో నెల్లూరు జిల్లా జనసేనకు పార్టీకి చాల కీలకమనే చెప్పాలి. అయితే ఇప్పటి వరకూ నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీ ఒక రూపు దిద్దుకోలేదు.  అందుకని తమ పార్టీని నెల్లురులో పటిష్టం చేసే దిశగా అడుగులు వేస్తోంది.

నెల్లూరు నియోజకవర్గంలో ఏ పార్టీ అయినా పర్వాలేదు, బరిలోకి దిగితే చాలు అనుకునే వారు చాలా మందే ఉన్నారు. ఇందులో కొంతమంది క్రీయాశీల పదవులలో కూడా ఉన్నారు. అలాంటి వారిని ఆకర్షించి తన పార్టీలో చేర్చుకుంటే, తన సేన బలపడుతుందని పవన్ ఆలోచనగా తెలుస్తోంది.  టీడిపి - వైసీపీ టిక్కెట్లు కోసం ప్రయత్నిస్తున్న వారిని తమవైపు తిప్పుకునే ప్రయత్నానాన్ని జనసేన మొదలు పెట్టింది. అంతేకాకుండా పవన్ సామాజిక వర్గమైన మరో నాయకుడిని కూడా ఆకర్షించే పనిలో పడింది జనసేన. అలాగే గూడూరులో అధికార పార్టీలో సరైన గుర్తింపు లేక లోలోపలే సతమతమవుతున్న మరో ఇద్దరు మహిళలను కూడా తమ వైపు తిప్పుకునేందుకు పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఇంతే కాకుండా నెల్లూరు టౌన్ - నవాబుపేట - మరికొన్ని మున్సీపాలీటీలలో మంచి పేరు ప్రతిష్టలున్న మరో నాయకుడికి వల విసిరినట్టు సమాచారం. నెల్లురులో కాపు నాయకులను తమవైపు తిప్పుకోవాలని పవన్ సూచించినట్లు సమాచారం. ఈ బాధ్యతను జనసేన కన్వీనర్ గంగాధర్‌ కు అప్పచెప్పినట్టు వినికిడి.అయితే జనసేన నాయకుడు పవన్ కల్యాణ్ చేస్తున్న ప్రయత్నాలైతే బాగానే ఉన్నప్పటికీ, రోజుకొక మాట మార్చే  పవన్‌ను నమ్మి ఎంతమంది నాయకులు జనసేనలో చేరుతారన్నది అనుమానాస్పదమే.

అయితే, ప‌వ‌న్ క‌ల్యాణ్ కంటే వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే వివిధ పార్టీల‌కు చెందిన నాయ‌కులు చూస్తున్నార‌ని స‌మాచారం. ప‌వ‌న్ కంటే కూడా జ‌గ‌న్ లో రాజ‌కీయ ప‌రిణిత ఎక్కువ‌ని - అంతే కాదు ముఖ్యమంత్రి అయ్యే అవ‌కాశాలు కూడా ఆయ‌న‌కే ఎక్కువ ఉన్నాయ‌ని జిల్లాలో ప్రచారం జ‌రుగుతోంది. పవ‌న్ ప్రయ‌త్నాల‌కు ఇది గండికొట్టే అవ‌కాశం ఉంది.
Tags:    

Similar News