జనసేనాని పవన్ కల్యాణ్... రాజకీయాల్లోకి రాకముందు టాలీవుడ్ లో పవర్ స్టార్ గా తిరుగులేని హీరోగా కొనసాగారు. 2014 ఎన్నికలకు ముందే పార్టీ పెట్టినా... ఎన్నికల్లో పోటీ చేయడానికే ఆయనకు ఏకంగా ఐదేళ్ల సమయం పట్టింది. పార్ట్ టైం పొలిటీషియన్ గా పేరు తెచ్చుకున్న పవన్... 2019 ఎన్నికల్లో భారీ ఎత్తున పోటీకి దిగినా... ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. 138 అసెంబ్లీ స్థానాల్లో తన పార్టీ అభ్యర్థులను నిలిపిన పవన్ ... తాను మాత్రం ఏకంగా రెండో చోట్ల నిలబడ్డారు. అయితే 138 స్థానాల్లో ఒక్క అభ్యర్థి మాత్రమే విజయం సాధించగా.. గెలిచిన రెండు చోట్లా ఓటమినే మూటగట్టుకున్న పవన్... అందరికీ షాకిచ్చారు.
ఈ షాక్ జనసైనికులకు గట్టిగానే తగిలింది. ఇక పవన్ అయితే దాదాపుగా రాజకీయాల్లో నుంచి పారిపోయే పరిస్థతి. ఈ క్రమంలోనే పవన్ తన సోదరుడు మెగాస్టార్ చిరంజీవి మాదిరే తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తారని - పవన్ రీ ఎంట్రీని భారీగా ఉండేలా ఆయన భక్తుడు బండ్ల గణేశ్ భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతున్నారని కూడా వార్తలు వినిపించాయి. ఈ వార్తలపై ఇప్పటిదాకా పవన్ నోరిప్పకుండానే సాగుతున్న నేపథ్యంలో ఈ వార్తలు నిజమేనేమోననే అనుమానాలు వ్యక్తమయ్యాయి.
అయితే తాజాగా ఈ తరహా వార్తలకు పవన్ బ్రేకులేసేశారు. ఓ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ తన భవిష్యత్తుకు సంబంధించి సంచలన ప్రకటన చేశారు. సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చేసిన పవన్... రాజకీయాల్లోనే ఇంకో 25 ఏళ్ల పాటు కొనసాగుతానని సంచలన ప్రకటన చేశారు. మరో 25 ఏళ్ల పాటు ప్రజా సేవలోనే కొనసాగుతానని క్లారిటీ ఇచ్చేసిన పవన్.. ఓడినా పాలిటిక్స్ ను వీడేది లేదంటూ తేల్చేశారన్న మాట.