రాజధాని మీద మీ మాట ఇదేనా పవనా?

Update: 2019-12-30 09:14 GMT
ఏపీలో మూడు రాజధానులు ఉండొచ్చు అంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చేస్తున్న హడావుడి అంతా కాదు. ఇప్పటికే ఈ అంశం ఏపీ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారటమే కాదు.. అనుకూల.. వ్యతిరేక వ్యాఖ్యలు జోరందుకున్నాయి. క్రిస్మస్ పండక్కి అత్తారింటికి వెళ్లిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ ఇష్యూ మీద ఏం మాట్లాడతారన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. తాను వచ్చి రావటమే మీడియా సమావేశం పెట్టేసి.. రాజధాని మీద క్లారిటీ ఇచ్చేస్తారన్న మాట వినిపించింది. దీంతో.. ఆయన ఏం మాట్లాడతారు? ఎలాంటి స్టాండ్ వినిపిస్తారన్న ఆసక్తి వ్యక్తమైంది.

ఇంతా చేస్తే.. రాజధాని మీద పవన్ నోటి నుంచి భట్టిప్రోలు పంచాయితీ తీర్పును గుర్తు చేసేలా వ్యవహరించారు. ఇంతకీ భట్టిప్రోలు పంచాయితీ ఏమిటంటారా? ఏదైనా ఇష్యూ మీద ఇద్దరికి వివాదం ఉంటే.. భట్టిప్రోలు పెద్దలు ఇద్దరు నష్టపోకుండా మధ్యేమార్గంగా తీర్పు చెబుతారు. ఒకవైపు వెళితే ఒకరికి లాభం.. రెండో వారికి నష్టం కలుగుతుంది. అందుకని ఇరువర్గాల లాభనష్టాలు సమానంగా ఉండేలా చేయటాన్ని భట్టిప్రోలు పంచాయితీగా పేరుంది.

ఏపీ రాజధాని విషయంలో పవన్ మాట కూడా ఇదే తీరులో ఉంది. గతంలో బాబు సర్కారు అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేస్తే.. ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఏపీలో మూడు రాజధానులకు అవకాశం అంటే కొత్త చర్చను షురూ చేశారు. ఇలాంటివేళ.. పవన్ తెర మీదకు వచ్చి అన్ని ప్రాంతాల వారు.. వర్గాల వారు ఆనందంగా  ఉండాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఒకరికి న్యాయం చేసి.. మరొకరికి అన్యాయం జరగాలని ఎవరూ కోరుకోకూడదన్న ఆయన.. ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరూ కలిసి ఒక అవగాహనకు రావాలన్నారు.

వినేందుక పవన్ మాటలు కమ్మగా ఉన్నప్పటికీ.. వాస్తవంలో మాత్రం అది సాధ్యం కాదన్నది మర్చిపోకూడదు. అమరావతి రాజధాని కావాలని అక్కడి ప్రజలు గట్టిగా కోరుకుంటే.. ముఖ్యమంత్రి మాట నేపథ్యంలో సీమ ప్రజలతో పాటు.. ఉత్తరాంధ్ర వారికి కొత్త ఆశలు మొగ్గ తొడిగాయి. ఇలాంటివేళ.. పవన్ మాష్టారు చెప్పినట్లుగా అందరూ హ్యాపీ అయ్యే సొల్యూషన్ ఎలా సాధ్యమన్నది ప్రశ్న.


Tags:    

Similar News