పార్టీ అధ్యక్షుడు ఓడిపోయి.. పార్టీ అభ్యర్థి గెలిచిన పరిస్థితి ఇప్పటివరకూ చూసింది లేదు. ఆ ముచ్చట కూడా తీరిపోయినట్లే. ఏపీకి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సిత్రం చోటు చేసుకుంది. ఎన్నో ఆశలు.. ఆకాంక్షల నడుము జనసేన బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. సర్వే చేయించుకొని మరీ.. తనకు అనుకూలంగా ఉన్న నరసాపురం.. గాజువాక నియోజకవర్గాల నుంచి బరిలో దిగిన జనసేనాని పవన్ కల్యాణ్ రెండు చోట్ల ఓడిపోవటం ఇప్పుడు సంచలనంగా మారింది.
బరిలో దిగిన నాటి నుంచి గాజువాకలో గెలుపు ఖాయమన్న మాట బలంగా వినిపించినా.. తాను పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోవటం షాకింగ్ గా మారింది. ఏపీ రాజకీయాల్లో కీలకభూమిక పోషిస్తారన్న ప్రచారానికి భిన్నంగా ప్రజలు ఇచ్చిన తీర్పుతో జనసేన భవిష్యత్తు మీద కొత్త సందేహాలు పుట్టుకొచ్చే పరిస్థితి.
ఇదిలా ఉంటే.. స్వయంగా జనసేనానే ఓటమి పాలైన వేళ.. అందుకు భిన్నంగా ఆ పార్టీ నుంచి రాజోలు ఎస్సీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన జనసేన అభ్యర్థి రాపాక వరప్రసాద్ విజయం సాధించటం ఇప్పుడు కొత్త సంచలనంగా మారింది.
జనసేన అభ్యర్థికి 30,310 ఓట్లు రాగా.. వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థికి 28,352 ఓట్లు వచ్చాయి. టీడీపీ నుంచి గొల్లపల్లి సూర్యారావు బరిలో దిగారు. ఈ త్రిముఖ పోటీలో జనసేన అభ్యర్థి సంచలన విజయం సాధించారు.
జనసేన అభ్యర్థి రాపాక 1958 స్వల్ప మెజార్టీతో విజయం సాధించటం ఇప్పుడు సంచలనమైంది. పార్టీ అధినేత ఓడిపోగా..పార్టీ అభ్యర్థి గెలిచిన వైనం ఇప్పుడు కొత్త చర్చకు తెర తీసిందని చెప్పాలి. దీన్ని పవన్ కల్యాణ్ ఎలా తీసుకుంటారో చూడాలి.