చంద్రబాబుతో పవన్ డైరెక్ట్ ఫైట్

Update: 2018-04-13 17:50 GMT
పార్టీ ఆవిర్భావ సభ తరువాత స్పీడు పెంచడంతో పాటు చంద్రబాబు నుంచి అంతే స్పీడుగా దూరం జరిగిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇప్పుడు చంద్రబాబుకు మరింత ఇరకాటంలో పెట్టేందుకు సిద్దమవతున్నారు. ఇప్పటికే నిత్యం చంద్రబాబుపై ఆరోపణలు - విమర్శలు గుప్పిస్తున్న ఆయన ఇప్పుడు చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో తన యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేయడానికి సిద్ధమవుతున్నారు. రాష్ట్రాన్ని పాలిస్తున్న చంద్రబాబు సొంత జిల్లాలో జరుగుతున్న అరాచకాల లిస్టు తెప్పించుకుని వాటిపై పోరాటానికి ఆయన రెడీ అయినట్లుగా సమాచారం. ఈ క్రమంలో తిరుపతి సమీపంలోని శెట్టిపల్లి భూకుంభకోణం, చిత్తూరు టౌన్లో హైవే ఇష్యూలను పవన్ ఎంచుకున్నారని.. దానిపై త్వరలో ఆయన అక్కడ పర్యటించి చంద్రబాబుపై సమరభేరి మోగిస్తారని జనసేన వర్గాలు చెప్తున్నాయి.
    
శెట్టిపల్లె భూములపై వివాదాలు ఇటీవల ఎక్కువవడం తెలిసిందే.. ఈ నేపథ్యంలోనే అక్కడి బాధితులు పవన్‌ ను కలిశారు. వివాదాల పూర్వాపరాలన్నీ తెలుసుకున్న పవన్ అందులో టీడీపీ నేతల పాత్ర గురించి వివరాలన్నీ తెలుసుకున్నారట. తెలుసుకోవడమే కాకుండా శెట్టిపల్లె వచ్చి అక్కడి సమస్యలపై పోరాడడానికి కూడా నిర్ణయించుకున్నట్లు చెప్తున్నారు. ఇందుకు ఈ నెల 23ని ముహూర్తంగా నిర్ణయించుకున్నారు. ఆ రోజున అక్కడ జనసభ నిర్వహించి చంద్రబాబును ఎండగట్టడానికి ఆయన సర్వం సిద్ధం చేసుకుంటున్నారట.
    
మరోవైపు చిత్తూరు జిల్లాలో పాటు ఏపీలోని అన్ని జిల్లాల్లో ప్రభుత్వ వైఫల్యం వల్ల తలెత్తిన సమస్యలను గుర్తించి వాటిపైనా పోరాడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.  ప్రజా సమస్యలపై రాష్ట్ర వ్యాప్త పోరాటం చేయడంలో భాగంగా చిత్తూరు జిల్లా నుంచి దానికి శ్రీకారం చుట్టనుండడంతో చంద్రబాబుపై పవన్ డైరెక్టు ఫైట్‌ కు దిగనున్నారని అర్ధమవుతోంది. అయితే.. ఇప్పటికే విపక్షాల పోరాటాలకు అనుమతులు ఇవ్వకుండా అడ్డుకుంటున్న ప్రభుత్వం పవన్ విషయంలో ఎలాంటి వైఖరి అనుసరిస్తుంది.. దీన్ని ఎలా ఎదుర్కొంటున్నదన్నది వేచి చూడాల్సిందే.
Tags:    

Similar News