జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యవహారం కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. రాజకీయ నేతల తీరుకు అస్సలు సరిపోని తీరు ఆయనలో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంటుంది. ఆయన సినిమా బ్యాక్ గ్రౌండ్ కావటం వల్లనేమో కానీ.. ప్రతి సినిమాకు స్టైల్ మార్చిన తీరులో పవన్ కూడా తన క్యాస్టూమ్స్ ను ఛేంజ్ చేస్తుంటారు. కొన్నిసార్లు లాల్చీ పైజమా.. మరికొన్నిసార్లు జీన్స్.. కుర్తా.. మరికొన్నిసార్లు ఫ్యాంట్ షర్ట్ తో ఉంటూనే.. అప్పుడప్పుడు పంచెతో అలరిస్తూ ఉంటారు.
తెలుగు రాజకీయాల్లో పాతతరం రాజకీయ నాయకుల్లో తప్పించి.. సమకాలీన రాజకీయాల్లో పంచెకట్టే నేతలుగా వైఎస్ ను .. రోశయ్య లాంటి అతి కొద్ది మందే కనిపిస్తారు. మళ్లీ ఇన్నాళ్లకు పవన్ పంచె కట్టులో కనిపిస్తూ ఉంటారు. ఇంతకీ.. ఆయన పంచె కట్టుడు వెనుక అసలు విషయం ఏమైనా ఉందా? అన్న సందేహానికి ఆయన ఆసక్తికర సమాధానాన్నే ఇచ్చారు.
పంచె కట్టటం వెనుక కారణం చెప్పిన పవన్.. తాను తెలుగువాడినని చెప్పటానికే పంచె కడుతుంటానని చెప్పారు. మరి.. అదే సంగతైతే.. సినిమాల్లోనూ విరివిగా పంచె కట్టేసి.. తమిళ తంబిల మాదిరి కాస్త డిఫరెంట్ గా ఉండి ఉంటే బాగుండేది కదా? తెలుగువాడిగా కనిపించాలంటే పంచె కట్టుకోవాలన్న విషయం సినిమాల్లో ఉన్నప్పుడు కాకుండా.. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాతే తెలిసిందా? ముందే తెలుసా? కాస్తంత క్లారిటీ ఇవ్వొచ్చుగా పవన్?
ఇక.. రాజకీయాల గురించి మాట్లాడిన పవన్.. రాజ్యాంగం ప్రకారం పాలన అందిస్తే ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. సర్ అర్దర్ కాటన్ మాదిరి ఉన్నత ఆశయంతో ధవళేశ్వరం ఆనకట్ట కట్టారని.. చంద్రబాబు కూడా మంచి ఆశయంతో పోలవరం కట్టాలని తాను కోరుకుంటానని చెప్పారు.
గోదావరి ప్రజలంటే అందరికి ఇష్టమని.. అలాంటి జిల్లాల్లో ఆక్వా భూతంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలని.. పెట్టుబడులు రావాలన్న ఆకాంక్షను వ్యక్తం చేసిన పవన్.. ప్రజలను భయపెట్టి భూములు లాక్కోకూడదన్నారు.