అనంతపురం జిల్లా మీద జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫోకస్ అంతకంతకూ పెరుగుతోంది. రానున్న ఎన్నికల్లో అనంతపురం జిల్లా బరి నుంచి తాను దిగనున్న విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పిన నేపథ్యంలో.. పాదయాత్ర ద్వారా అనంత వాసులకు మరింత దగ్గరయ్యేలా పవన్ ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు.
గతంలో తాను నిర్వహించిన అనంతపురం పర్యటనలో జిల్లా కరవు పరిస్థితులు తెలుసుకునేందుకు పాదయాత్ర చేస్తానని మాట ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాదయాత్రను నిర్వహించటం ద్వారా రైతుల కష్టనష్టాలను తెలుసుకోవటంతో పాటు.. కరవు పరిస్థితులపై అవగాహన మరింత పెంచుకోవచ్చన్న ఉద్దేశంతో ఆయన ఉన్నట్లు చెబుతున్నారు. 2016 నవంబరు 10 జరిగిన బహిరంగ సభలోనూ జిల్లాపై తనకు ప్రత్యేక అభిమానం ఉన్నట్లుగా చెప్పిన ఆయన.. రాష్ట్రంలో తన తొలి పార్టీ కార్యాలయాన్ని అనంతపురంలోనే ప్రారంభించనున్నట్లు కూడా వెల్లడించారు.
మరో రెండేళ్ల వ్యవధిలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో.. ముందు నుంచే అనంతపురం మీద ప్రత్యేక దృష్టి పెట్టాలన్నా ఆలోచనలో పవన్ ఉన్నట్లుగా తెలుస్తోంది. తన పాదయాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్ ను జిల్లా సమగ్రాభివృద్ధి సంస్థ నాయకుల సాయాన్ని కోరినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే పాదయాత్ర రూట్ మ్యాప్ సిద్ధమైందని.. పవన్ డేట్ ఫిక్స్ చేసుకోవటమే తరువాయి అని చెబుతున్నారు.
పవన్ పాదయాత్ర రూట్ మ్యాప్ విషయానికి వస్తే.. కళ్యాణదుర్గం నుంచి మొదలైన యాత్ర.. అక్కడ నుంచి మడకశిర.. పెనుగొండ నియోజకవర్గాల మీదుగా గోరంట్ల.. పుట్టపర్తి.. ధర్మవరం.. అనంతపురం వరకూ సాగుతుందని తెలుస్తోంది. మూడు రోజుల పాటు పవన్ పాదయాత్రలో పాల్గొంటారని ముగింపులో భారీ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించటం ద్వారా.. పవన్ అనంతపురం జిల్లా పర్యటన పూర్తి అవుతుందని చెబుతున్నారు. రూట్ మ్యాప్ పక్కా అయినట్లేనని.. డే్ట్స్ ఫిక్స్ చేసుకోవటం మాత్రమే బ్యాలెన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/