పవన్ కు ఆ ప్రాబ్లమ్ మరింత పెరిగిందా?

Update: 2019-07-31 04:32 GMT
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సంబంధించిన ఒక కొత్త మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. గతంలో ఆయన కళ్లజోడు వాడేవారు కాదు. పుస్తకాలు బాగా చదవటం వల్ల కంటిచూపు విషయంలో కాస్త తేడా కొట్టినట్లుగా అప్పట్లో చెప్పారు. దీనికి తగ్గట్లే కళ్లజోడు పెట్టుకొని చదవటం కనిపించేది. ఏదైనా విషయాన్ని చూసి చదవాల్సి వచ్చినప్పుడు రీడింగ్ గ్లాస్ తప్పనిసరి అన్నట్లు వాడటం షురూ చేశారు.

ఇటీవల ముగిసిన ఎన్నికల సమయంలో కానీ.. ప్రచారంలోనూ ఆయన కళ్లజోడును వెంట పెట్టుకొని వెళ్లటం లేదు. అందుకు భిన్నంగా ఇప్పుడు కళ్లజోడు తనతో క్యారీ చేస్తున్న వైనం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. గతంలో రీడింగ్ గ్లాస్ కు పరిమితమైన పవన్.. ఇప్పుడు అందుకు భిన్నంగా.. తన వెంట కళ్లజోడును వెంట తీసుకెళ్లటం కనిపిస్తుంది.

తాజాగా ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన సందర్భంలో పవన్ చొక్కా జేబులో కళ్లద్దాలు పెట్టుకోవటం చూస్తే.. సైట్ ఇష్యూ పెరిగిన వైనం కనిపించకమానదు. గతంలో పత్రాలు చదివేటప్పుడు మాత్రమే ఉపయోగించే కళ్లద్దాలు ఇప్పుడు వెంట తీసుకెళ్లటం చూస్తుంటే.. కంటిచూపు సమస్య బాగా పెరిగినట్లుగా అర్థం కాక మానదు. పెరిగే వయసుతో పాటు కొందరిలో చూపు సమస్య పెరుగుతూ ఉంటుంది. ఇలాంటి ఇబ్బందినే ప్రస్తుతం పవన్ కల్యాణ్ ఎదుర్కొంటున్నట్లుగా చెప్పక తప్పదు.
Tags:    

Similar News