ప‌వ‌న్ చెప్పిందేమిటి? మీడియాలో వ‌చ్చిందేమిటి?

Update: 2019-03-02 05:53 GMT
రెండేళ్ల ముందే యుద్ధం గురించి నాకు తెలుసు.. బీజేపీ చెప్పిందంటూ కొన్ని ప్ర‌ధాన ప‌త్రిక‌ల్లోనూ.. ఇత‌ర మీడియాలో వ‌చ్చిన వార్త‌ల్లో ఇసుమంత కూడా నిజం లేద‌న్న విష‌యాన్ని జ‌న‌సేన త‌న అధికారిక ట్విట్ట‌ర్ ఖాతాలో ఒక పోస్ట్ ను పోస్టు చేసింది. ఇందులో.. ఫిబ్ర‌వ‌రి 26న‌.. త‌ర్వాత ఫిబ్ర‌వ‌రి 28న రెండు స‌భ‌ల్లో ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌లకు సంబంధించిన వీడియో క్లిప్ ల‌ను పోస్ట్ చేశారు.

అందులో యుద్ధ వాతావ‌ర‌ణం ఉంద‌ని.. యుద్ధం వ‌స్తుంద‌ని త‌న‌కు రెండేళ్ల ముందే చెప్పార‌న్నారు కానీ.. ఎవ‌రుచెప్పారు.. ఏం చెప్పారు? అన్నవేమీ లేవు. అదే స‌మ‌యంలో ఫిబ్ర‌వ‌రి 28న కాలేజీ విద్యార్థుల‌తో మాట్లాడిన సంద‌ర్భంగా మాత్రం.. యుద్ధం ఎలా వ‌స్తుంద‌న్న విష‌యాలు త‌న‌కు ముందే తెలియ‌టానికి పాక్ వాళ్ల‌తో తాను మాట్లాడ‌లేదంటూ జోక్ చేశారు.

జ‌న‌సేన పోస్ట్ చేసిన వీడియోలో ఉన్న దాని ప్ర‌కారం.. కొన్ని దిన‌ప‌త్రిక‌ల్లోనూ.. కొన్ని అంత‌ర్జాతీయ మీడియా సంస్థ‌ల్లో ఉన్న వార్త‌ల్ని.. విశ్లేష‌ణ‌ల్ని చ‌దివిన‌ప్పుడు ఆ విష‌యాలు త‌న‌కు అర్థ‌మ‌య్యాయ‌న్నారు. దేశంలో యుద్ధం రాబోతుంద‌ని చెప్పేందుకు ప‌లువురు రాజ‌కీయ విశ్లేష‌కులు త‌మ విశ్లేష‌ణ‌లో భాగంగా అంచ‌నా వేశార‌ని.. అది త‌న జోస్యం కాద‌ని.. విశ్లేష‌కులు మాట‌ల్ని తాను ప్ర‌స్తావించిన‌ట్లు చెప్పారు. ప‌వ‌న్ చెప్ప‌ని మాట‌ల్ని చెప్పిన‌ట్లుగా మీడియా  రిపోర్ట్ చేయ‌టం స‌రికాద‌ని ఆ పార్టీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోంది.


Tags:    

Similar News