ప‌వ‌న్ క‌ల్యాణ్.. ఆశ‌లావు పీక స‌న్నం!

Update: 2020-01-19 17:30 GMT
తెలంగాణ‌లో త‌న పార్టీ బ‌లోపేతం మీద దృష్టిసారిస్తానంటూ జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌క‌టించుకోవ‌డం కామెడీగా మారుతూ ఉంది. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇప్ప‌టి వ‌ర‌కూ త‌న పార్టీని ఒక నిర్మాణంలోకి తెచ్చుకోలేక‌పోయారు. ప‌వ‌న్ క‌ల్యాన్ త‌ర్వాత జ‌న‌సేన‌లో ఎవ‌రు ఏమిటి అనేది చెప్ప‌డం ఆ పార్టీలోని వారికి కూడా అంతుబ‌ట్ట‌ని అంశ‌మే! ఇప్ప‌టి వ‌ర‌కూ జ‌న‌సేన‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌ప్ప మ‌రో చెప్పుకోద‌గిన నేత లేరు. నాదెండ్ల మ‌నోహ‌ర్ ఉన్నా.. ఆయ‌న‌కు ఉన్న జ‌న‌బ‌లం ఏమిటో అంద‌రికీ తెలిసిందే. ఇలా టూ మెన్ ఆర్మీగా సాగుతూ ఉంది ప‌వ‌న్ క‌ల్యాణ్ పార్టీ.

ఇక ఇప్పుడు బీజేపీతో పొత్తు అంటున్నారు. బీజేపీకే ఏపీలో స‌రైన క్యాడ‌ర్ లేదు, ఓటు బ్యాంకు లేదు, బ‌లం లేదు. ఇలాంటి నేప‌థ్యంలో.. ఈ రెండు పార్టీలూ క‌ల‌వ‌డం జోగీ జోగీ రాసుకోవ‌డ‌మే అని ప‌రిశీల‌కులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో కూడా ప‌వ‌న్ క‌ల్యాణ్ మాట‌లు అయితే ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు.

తెలంగాణ‌లో త‌న పార్టీ బ‌లోపేతం ఉంటుంద‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న వారితో ప్ర‌క‌టించుకున్నార‌ట‌. త్వ‌ర‌లోనే తెలంగాణ‌లో జ‌న‌సేన బలోపేతం మీద దృష్టిసారించ‌బోతున్న‌ట్టుగా వారికి చెప్పార‌ట‌.  ఇదే కామెడీ అంటే అంటున్నారు విశ్లేష‌కులు.

ప‌వ‌న్ క‌ల్యాణ్ కు ఏమైనా బేస్ మెంట్ ఉందంటే అది ఆంధ్ర‌లో ఎంతో కొంత ఉంది. కుల‌బ‌లం, సినీ అభిమానం క‌లిసి అక్క‌డ ప‌వ‌న్ కు ఐదారు శాతం ఓటు బ్యాంకు ఉంద‌ని తేలింది. ఒక‌వేళ ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్నింటికీ తెగించి పోరాడి ఉంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి అయినా ఎంతో కొంత అది పెరిగేది. అయితే ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆరు నెల‌ల‌కే చేతులు ఎత్తేశారు. బీజేపీతో చేతులు క‌లిశారు. ఇది జ‌న‌సేన ఓటు బ్యాంకును మ‌రింత చెల్లాచెద‌రు చేయ‌వ‌చ్చు.

ఇక తెలంగాణ మీద బీజేపీ ఆశ‌లు బోలెడ‌న్ని ఉన్నాయి. అలాంటి చోట ప‌వ‌న్ కు ఏదైనా ఒక‌టీ అర శాతం ఓటు బ్యాంకు ఉన్నా.. దాన్ని కూడా బీజేపీ త‌న వైపుకు తిప్పుకోవాల‌ని చూస్తుంది త‌ప్ప‌.. ఏదో ప‌వ‌న్ క‌ల్యాణ్ ను బ‌లోపేతం కానివ్వ‌దు.

ఇలాంటి ప‌రిస్థితుల్లో కూడా ప‌వ‌న్ క‌ల్యాణ్ తెలంగాణ‌..త‌న పార్టీ బలోపేతం..అని అన‌డం ఆయ‌న కు వాస్త‌వాలు అర్థం కావ‌డం లేద‌నే అభిప్రాయాన్ని క‌లిగిస్తోంద‌ని ప‌రిశీల‌కులు అంటున్నారు. ఆయ‌న‌కు ఆశ‌లావు పీక స‌న్నం అని అభిప్రాయ‌ప‌డుతున్నారు.


Tags:    

Similar News