బీజేపీ-టీడీపీ బంధం నుంచి పవన్ సైడ్?

Update: 2016-03-06 07:41 GMT
జనసేన అధినేత పవన్ కల్యాణ్ బీజేపీ-టీడీపీ కూటమి నుంచి వేరుపడాలనుకుంటున్నారా?  కాపుల సంక్షేమం విషయంలో ఆయన అసంతృప్తిగా ఉండడం వల్ల ఈ నిర్ణయం తీసుకుంటున్నారా.. లేదంటే విభజన హామీల విషయంలో చేయిచ్చిన బీజేపీ తీరు, బీజేపీని ప్రశ్నించలేకపోతున్న టీడీపీ తీరుకు నిరసనగా ఆయన తన దారి తాను చూసుకుంటున్నారా? అన్న చర్చలు జరుగుతున్నాయి.

2014 సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం-బీజేపీ కూటమికి మద్దతుగా నిలిచిన పవన్ కల్యాణ్ ఇప్పుడు ఆ కూటమికి దూరం జరగాలని నిర్ణయించుకున్నారని సమాచారం. కొద్ది రోజుల్లో ఆయన తన మనసులోని మాట అభిమానులకు చెబుతారని తెలుస్తోంది. విభజన చట్టంలోని హామీల అమలు విషయంలో బీజేపీ అనుసరిస్తున్న వైఖరే కారణమని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. గత కొంత కాలంగా బీజేపీ వైఖరి పట్ల పవన్ అసహనంగా ఉన్నారని చెబుతున్నారు. జనసేన సిద్ధాంతాలు - విధానాలకు బీజేపీ-టీడీపీ నిర్ణయాలు విరుద్ధంగా ఉండటంతో ఆయనీ నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. అయితే అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించేందుకు పవన్ కల్యాణ్ మరి కొంత సమయం తీసుకుంటారనీ, బహిరంగ సభ ఏర్పాటు చేసి మరీ తన నిర్ణయాన్ని వెల్లడిస్తారని వారు అంటున్నారు. అదే సమయంలో తాను దూరం జరగడానికి కారణాలు చెప్పడమే కాకుండా కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయన కొన్ని ప్రశ్నలు సంధించే అవకాశం ఉందంటున్నారు. మొత్తానికి బీజేపీ-టీడీపీ నుంచి పవన్ దూరం జరిగితే తన దారి తాను చూసుకుంటారా లేదంటే మళ్లీ వేరే కాంబినేషన్ ఏమైనా ట్రై చేస్తారా అన్నది చూడాలి.
Tags:    

Similar News