ఏపీలో రాజకీయం గతానికి భిన్నంగా సాగుతోంది. నిజానికి చూస్తే ఎన్నికల ఏడాదిలో అధికార పార్టీ మీద ఉన్న వ్యతిరేకత కచ్చితంగా విపక్షంలో ఉన్న ఏదో ఒక పార్టీకి టర్న్ కావాల్సి ఉంటుంది. ఈ పాటికి అలాంటి సంకేతాలు అయితే ఇప్పటిదాకా రాకపోవడం వింత గానే ఉంది. సరిగ్గా ఈ పాయింట్ నే ఆసరాగా తీసుకుని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక్క చాన్స్ అంటూ జనంలోకి వస్తున్నారు అని అంటున్నారు.
వారాహి రధమెక్కి పవన్ ఒక్క చాన్స్ ఇవ్వండి ఈసారి సీఎం గా తనకు పూర్తి స్థాయిలో పవర్ ఇవ్వండి అని కోరుతున్నారు. ఇది పవన్ లో వచ్చిన బలమైన మార్పుగానే అంతా చూస్తున్నారు. నిజానికి పవన్ పొత్తుల వైపుగానే ఉంటూ వచ్చారు. తనకు సీఎం ఆశలు లేవని కూడా చెప్పుకున్నారు. ఏపీలో వైసీపీ వ్యతిరేక ఓట్లను చీలనివ్వను అంటూ ప్రకటించారు.
కానీ వారాహి యాత్రలో మాత్రం ఆయన ఆ రకంగా స్టేట్మెంట్స్ ఇవ్వడంలేదు. పైగా టీడీపీ బీజేపీల గురించి కూడా ఎక్కడా ప్రస్థావించడంలేదు. తనకు అధికారాన్ని ఇవ్వాలని సీఎం ని చేయాలని కోరుతున్నారు. అలా పవన్ కోరడమే ఇపుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా ఉంది. అదే టైం లో టీడీపీలోనూ చర్చగా ఉంది.
తమతో పొత్తులకు కలసి వస్తారని పవన్ని భావించిన టీడీపీకి కూడా వారాహి రధమెక్కి పవన్ చేస్తున్న స్పీచులు అర్ధం కావడం లేదు అంటున్నారు. అసలు పవన్ ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు. ఆయన వ్యూహాలేంటి అంటే చాలానే కధ ఉంది అని అంటున్నారు.
ఏపీలో చూస్తే గడచిన నాలుగేళ్ళ కాలంలో వైసీపీ మీద జనాల్లో వ్యతిరేకత అయితే గట్టిగానే ఉంది. కానీ అది అనుకున్నంతగా టీడీపీకి టర్న్ కావడంలేదు. టీడీపీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. అయినా సరే వైసీపీ మీద వస్తున్న వ్యతిరేకతను పూర్తి స్థాయిలో సొమ్ము చేసుకోలేకపోతోంది. అదే టైం లో ఏపీలో జనాల మూడ్ కూడా మారుతోంది అని అంటున్నారు.
అయితే వైసీపీ లేకపోతే టీడీపీ యేనా అన్న చర్చ కూడా వస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ సైతం ఇదే రకంగా ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. ఆయన ఏపీలో వర్తమాన రాజకీయ పరిస్థితుల మీద తాను సొంతంగా చేయించుకున్న సర్వేలను కూడా దగ్గర పెట్టుకుని తన రాజకీయాన్ని మార్చుకుంటున్నారు అని అంటున్నారు. ఏపీలో వైసీపీ మీద నిండా వ్యతిరేకత అయితే ఉంది. కానీ అది అంతా టీడీపీకి టర్న్ కావడం లేదు, కొన్ని చోట్ల టీడీపీ వీక్ గానే ఇప్పటికీ ఉంది.
దాంతో పాటు జనాల్లో ఉన్న రాజకీయ నైరాశ్యాన్ని కూడా అవకాశంగా తీసుకుంటే తనకు కచ్చితంగా మేలు జరుగుతుంది అని పవన్ భావిస్తున్నారులా ఉంది. ఈ పరిణామంతోనే వైసీపీ మీద ఎంత వ్యతిరేకత ఉందో దాన్ని ఆయన తన వైపు కూడా చాలా వరకు టర్న్ చేయించుకుంటే రేపటి రోజున ఏపీలో తానే బలమైన ఆల్టర్నేషన్ గా నిలుస్తాను అని భావిస్తున్నారు అని అంటున్నారు.
అందుకోసమే పవన్ కళ్యాణ్ పదే పదే సీఎం గా తాను ఉంటాను, తనకు అవకాశం ఇప్పించాలని కోరుతున్నారని అంటున్నారు. అయితే ఏపీలో వైసీపీకి రెడీ మేడ్ గా ఉన్న ఆల్టర్నేషన్ టీడీపీ మాత్రమే. వైసీపీని కాదంటే జనాలు టీడీపీ వైపే మొగ్గు చూపిస్తారు జనసేన ఇంకా బలపడలేదు. సంస్థాగతంగా కూడా ఆ పార్టీ గట్టిగా లేదు. మీటింగులకు జనాలు వస్తున్నారు కానీ ఒక బలమైన పార్టీగా అయితే జనసేన ఇంకా మారాల్సిన అవసరం ఉంది.
అందువల్ల ఎన్నికలు దగ్గరపడేకొద్దీ పొలరైజేషన్ జరిగితే కనుక అది కచ్చితంగా టీడీపీకే అనుకూలిస్తుంది అని అంటున్నారు. ఏపీ జనాలు ఓటు వేసే ముందు బెస్ట్ ఆప్షన్ వైపే చూస్తారని అంటున్నారు. అలా కనుక చూస్తే టీడీపీకే ఆల్టర్నేషన్ అవకాశాలు ఉంటాయని అంటున్నారు. అయితే రాజకీయాల్లో ఎవరి ప్రయత్నం వారిది. పవన్ కళ్యాణ్ తనకు ఉన్న సినీ గ్లామర్ తో పాటు సామాజికవర్గం పరంగా ఉన్న బలాన్ని చూపిస్తూ జనసేనను జనంలో ఉంచుతున్నారు. చూడాలి మరి ఆయన వ్యూహాలు ఎలా సక్సెస్ అవుతాయన్నది.